పాతపట్నం: ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాల ని, పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమాకం చేపట్టి, వెంటనే 29 శాతం ఐఆర్ ప్రకటించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు లండ బాబూరా వు, మజ్జి వెంకటరమణలు డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మార్కెట్ మీదుగా ఆల్‌ఆంధ్రరోడ్డు, ఆస్పత్రి కూడలి మీదుగా అంబేడ్కర్ జంక్షన్ వరకు ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఉద్యో గ, ఉపాధ్యాయులకు బకాయి పడిన ఐదు డీఏల ను ప్రకటించాలని, 40 వేల కోట్ల ఆర్థిక బకాయిల ను విడుదల చేయాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


