శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం పునఃప్రారంభం సోమవారం సాయంత్రం 4:23కు నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా మీడియా సెల్ ఇన్‌చార్జి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మండవల్లి రవి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు 7 రోడ్డు జంక్షన్ వద్ద మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి, టౌన్ హాల్‌కు చేరుకుంటామన్నారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
వేధిస్తున్న సుంకు పురుగుల బెడద
సరుబుజ్జిలి: నందికొండ కాలనీకి సమీపంలో నిర్మించిన ఆంధ్ర రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిర్మించిన గోదాములు నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల సుంకు పురుగుల బెడద పెరిగిందని ప్రజలు వాపోతున్నారు. గోదాంలో నిల్వ ఉన్న బియ్యానికి పట్టిన సుంకు పురుగుల వల్ల సమీపంలో ఉన్న వైఎస్సార్ కాలనీ, నందికొండ కాలనీ నివాసం ఉంటున్న సుమారు 1456 కు టుంబాల వారు ఇబ్బందులు పడుతున్నారు. గృహాల్లోకి రాత్రి, పగలు తేడా లేకుండా పురుగులు వచ్చేస్తున్నాయి. అధికారులు తక్షణ చర్యలు చేపట్టకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు కాలనీవాసులు తెలిపారు.
ఉల్లాసంగా ఆట్యా–పాట్యా జిల్లా జట్ల ఎంపికలు
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఆట్యా–పాట్యా సబ్ జూనియర్స్ క్రీడా ఎంపికల్లో బాల బాలికలు ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల బాలికలకు వేర్వేరుగా ఎంపికలు నిర్వహించారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో కర్నూలులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.


