శ్రీకాకుళం అర్బన్: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయా లని ఏపీసీపీఎస్‌ఈఏ ప్రతినిధులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయంలో శనివారం ఏపీ ఎన్‌జీజీఓ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం ఆధ్వర్యంలో ఏపీసీపీఎస్‌ఈఏ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు వీవీ రాజు మాట్లాడుతూ సెప్టెంబరు 1న జరగబోయే ధర్నాను విజయవంతం చే యాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీసీపీఎస్‌ఈఏ ప్రతినిధుల డిమాండ్‌కు మద్దతుగా ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి. శ్రీరామ్మూర్తి, పీఆర్‌టీయూ అధ్యక్షుడు టి.మురళి, ఏపీటీఎఫ్ అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస, బీటీఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.రమేష్‌బాబు, ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వేణుగోపాల్, ఏపీ ఎన్ జీజీవో జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాసరావు, కోశాధికారి బడగల పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయులు ఎం.రామ్మోహనరావు, టి.ఉపేంద్ర పాల్గొన్నారు.


