శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిలు శనివారం హాజరయ్యారు. ఒక ల్యాండ్ కేసు విషయమై ఇద్దరూ హాజరైనట్లు రూరల్ ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు శాఖ విద్యార్థిని, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామమైన జయంతిపురానికి చెందిన గిరిజన యువతి కిల్లో సరోజిని యూజీసీ–నెట్ జూన్–2026 ఫలితాల్లో సత్తా చాటారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతతో పాటు ప్రతిష్టాత్మక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) సాధించి జాతీయ స్థాయిలో ఘనత సాధించినట్లు ఆమె సోదరుడు, శాసనాం ఉన్న త పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బొమ్మిడి ఢిల్లేష్ శనివారం తెలిపారు. తన విజయానికి తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, ఆచా ర్యులు వెలమల సిమ్మన్న, పరిశోధకుడు, సోదరుడు బొబ్మిడి ఢిల్లేష్ అందించిన మార్గదర్వకత్వం, ప్రోత్సాహమే కారణమని సరోజిని తెలిపారు.
కవిటి: మండల పరిధిలోని జాడుపుడి ఆర్‌ఎస్, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు శనివారం గుర్తించారు. మృతుడు ఎరుపు రంగు టీషర్ట్, నీలంరంగు నైట్‌ప్యాంట్ ధరించి ఉన్నట్లు వెల్లడించారు. అతని చేతిపై ఇంగ్లిష్‌లో జయదేబ్ అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని గుర్తించినవారు పలాస రైల్వే పోలీ సు ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు(92475 85743) ను సంప్రదించాలని కోరారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: పెండింగ్‌లో ఉన్న నోటీసులను సత్వరమే పూర్తి చేయాలని అదనపు ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి శేనాపతి ఢిల్లీరావు తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లతో కలసి ఆయన ప్రత్యేక జాబితా సవరణపై సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక జాబితా సవరణపై కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గల ఎనిమిది నియోజకవర్గాల్లో నోటీసుల పంపిణీ పూర్తయ్యిందా లేదా అని ప్రశ్నించగా పంపిణీ పూర్తయ్యిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో మ్యాపింగ్ కాని వివరాలను, ఫార్మ్ 6, 7, 8ల గూర్చి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 93,457 విచారణ జరిగాయని, 7184 పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. బందరువానిపేట బీఎల్‌ఓ రమేష్ మాట్లాడుతూ 150 మంది మత్స్యకార ఓటర్లు జాబితాలో నమోదు కాలేదని, మత్స్యకారులు సముద్రంలో వేటనిమిత్తం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు చెప్పగా మత్స్యకారులు సముద్రంలో ఉన్నప్పుడు వర్చ్వుల్‌గా నమోదు చేయవచ్చని అదనపు సీఈఓ చెప్పారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: గిరిజనుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో చెంచు తెగకు సంబంధించిన జిల్లా సంఘం ఉన్నతి సభ్యులకు సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజ్ రుణం రూ.8 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శిక్షణ కలెక్టర్ హరి ఓం పాండ్య తదితరులు పాల్గొన్నారు.


