టెక్కలి: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్)లో భాగంగా ముసాయిదా విడుదల అనంతరం వివిధ రకాల క్లెయిమ్స్, అభ్యంతరాలకు సంబంధించి టెక్కలి మేజర్ పంచాయతీలో బూత్ స్థాయిలో నిర్వహిస్తున్న నమోదు పరిశీలనను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. బూత్ స్థాయిలో బీఎల్‌ఓల పనితీరును తెలుసుకున్నారు. ముసాయిదా అనంతరం వివిధ రకాల కారణాలతో తప్పిపోయిన ఓటర్లను మళ్లీ జాబితాలో చేర్చేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక నమోదు కార్యక్రమంలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటు గల్లంతు కా కూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఇన్‌చార్జి తహసీల్దార్ రాంబాబు ఉన్నారు.


