చినుకు కోసం కలవరింత | - | Sakshi
Sakshi News home page

చినుకు కోసం కలవరింత

Jul 20 2026 1:02 AM | Updated on Jul 20 2026 1:02 AM

● మొక్క దశలో ఎండిపోతున్న వరి పొలాలు

ఎండిపోతున్న వరి పొలాలు

జలుమూరు: ఎల్‌ నినో ప్రభావంతో రైతు కంట కన్నీరు ఆగడం లేదు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతన్న గుండె చెరువవుతోంది. మొక్క దశలో ఉన్న వరి పైరు ఎండిపోతోంది. సుమారు నెల రోజులు నుంచి జిల్లా వ్యాప్తంగా కనీసం బట్టతడుపు చినుకు పడిన సందర్భం లేదు. ఇప్పటికే వరి ఎదలు దాదాపు పూర్తవ్వగా నారుపోత కూడా అయి నాట్లకు సిద్ధంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,65,683 హెక్టార్లలో వరి సాగవ్వగా ఇందులో సుమారు 80 శాతం వెద పద్ధతిలో విత్తనాలు వేశారు. మిగిలిన 20 శాతం కూడా నారు పోసి నాట్లకు సిద్ధం చేశారు. వంశధా ర కూడా ఈ ఏడాది ప్రవాహం తక్కువగానే ఉంది. కు డి, ఎడమ కాలువల్లో 582, 308 2 క్యూసెక్కులు ప్రవహిస్తోంది.

కాలువలకు మరమ్మతులు లేకపో వడం, సన్నద్ధత లేకుండా నీరు శి వారుకు విడిచిపెట్టడం, గట్లు పటిష్టం చేయకపోవడం వంటి కారణాల వల్ల నరసన్నపేట, జలు మూరు, హిరమండలం, సారవకోట, పోలాకి తదితర మండలాల రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. ఇటీవల సారవకోట మండలం అక్కివలస వద్ద ప్రధాన కాలువకు గండి పడి నాలుగు రోజుల వరకు నీరు నిలుపుదల చేశారు. ప్రస్తుతం ఎడమ కాలువలో నీరు కింద పొలాలకు సరి పడా ఉన్నా కాలవ గట్టు బలహీనంగా ఉండడంతో అధికారులు నీరు పూర్తి స్థాయిలో విడిచిపెట్టడం లేదు.

గట్టు బలహీనంగా ఉంది

కాలువ గట్టు బలహీనంగా ఉంది. నీరు విడిచిపెడితే గండిపడే ప్రమాదం ఉంది. శివారు భూములకు సాగునీరు విడిచిపెట్టాలని నిబంధన ఉంది. దీంతో రైతులకు కొంత వరకూ ఇబ్బంది కలుగుతోంది.

– సరస్వతి, వంశధార డీఈఈ గొట్టా బ్యారేజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement