నరసన్నపేటలో సీఎం పర్యటించి
రెండు నెలలు
నాలుగు శాఖలకు రూ.కోటి పైనే ఖర్చు
ఇప్పటికీ పైసా రాని పరిస్థితి
ల్లులు నిల్
డంపింగ్ యార్డు ముస్తాబు (ఫైల్)
నరసన్నపేట: స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నరసన్నపేటకు మే 16న వచ్చారు. ఆయన పర్యటన పూర్తయ్యి రెండు నెలలైంది. కానీ పర్యటనలకు సంబంధించి అధికారులు చేసిన ఖర్చులకు బిల్లులు ఇప్పటికీ రాలే దు. దీంతో వివిధ శాఖల అధికారులు అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి డబ్బులు పెట్టామని, బిల్లులు చేసేందుకు నెలలు పడితే ఎలా అని మదన పడుతున్నారు. కలెక్టర్ నరసన్నపేటలో తిష్ట వేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ముఖ్యమంత్రి కంట చెత్త కనపడితే ఏమవుతుందో అని ఆందోళనతో లక్షలు వెచ్చించి పారిశుద్ధ్య పను లు చేపట్టారు. 20 వార్డుల్లో రోజుకు పది మంది చొప్పున పారిశుద్ధ్య కార్మికులు పది రోజులు పనిచేశారు. అలాగే జిల్లా యంత్రాంగం అంతటినీ నరసన్నపేటకు తీసుకువచ్చి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే తామరాపల్లి వద్ద హెలీప్యాడ్, కార్యకర్తల సమావేశం నిర్వహణకు సభా వేదిక ఏర్పాట్లు, స్వర్ణాంధ్ర సభ వద్ద ఏర్పాట్లు పోటాపోటీగా నిర్వహించారు. డంపింగ్ యార్డు వద్ద అనేక ముస్తాబులు చేశారు. 16న ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యింది. అయితే ఏర్పాట్లకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో స్థానిక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
నరసన్నపేట పంచాయతీ రూ.29 లక్షలకు బిల్లు పెట్టింది. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ రూ. 15 లక్షలకు బిల్లు పంపారు. ఆర్‌అండ్ బీకి రూ. 20 లక్షలైంది. పంచాయతీ రాజ్ శాఖకు రూ. 40 లక్షలు వెచ్చించింది. దీనికి తోడు పోలీసు శాఖకూ ఖర్చయ్యింది. కలెక్టర్ దగ్గరుండి పనులు చేయించారని ఇప్పుడు బిల్లులు చెల్లింపు వద్దకు వచ్చే సరికి జాప్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నా రు. పంచాయతీ అధికారులు చే బదులుకు డబ్బు తెచ్చి ఖర్చు చేశారు. వచ్చిన అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు భోజనాలు, జేసీబీలు, ట్రాక్టర్లకు డీజిల్ తదితర వాటికి పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. ఇప్పుడు బిల్లులు సకాలంలో రాక పోవడంతో అప్పుల వాళ్ల వద్ద ముఖం చాటేసుకొని తిరుగుతున్నారు.


