ఎస్పీ గ్రీవెన్స్‌కు 53 వినతులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేదిక (గ్రీవెన్సు)కు 53 వినతులు అందాయి. అదనపు ఎస్పీ కె.వి.రమణ అర్జీలు స్వీకరించి బాధితులతో నేరుగా మాట్లాడారు. సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
యాసిడ్ దాడి చేశారు..
2024లో తనపై యాసిడ్ దాడికి యత్నించారని, 2025 అక్టోబరు 20న దుండగులు వచ్చి ఇంటికి నిప్పంటించారని, అంతా సీసీ ఫుటేజీలో నిక్షిప్తమైందని, ఇదే విషయమై 112 కాల్‌కు ఫిర్యాదు చేసినా, స్టేషన్‌కు లెక్కలేనన్ని సార్లు వెళ్లినా శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు గుడ్ల శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.


