సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇంటర్నెట్ భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కె.వి.మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న ‘సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం’ పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అవగాహన ప్రచార పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి ఇంటర్నెట్ కోసం అనే థీమ్‌తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డీఐఓ కిరణ్‌కుమార్, ఏడీఐఓ విజయబాబు, ఎల్డీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


