వర్సిటీ విద్యార్థులతో ‘క్వాంటమ్ టాక్’
ఎచ్చెర్ల్ల : క్వాంటమ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో మంగళవారం ఏపీ ప్రభుత్వంతో కలసి అమెరికాకు చెందిన వైజర్, క్యూబిట్ సంస్థలు క్వాంటమ్ టెక్నాలజీపై ఇవ్వనున్న శిక్షణా కార్యక్రమంపై ఆన్‌లైన్‌లో వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, కళాశాలల ప్రతినిధులు, విద్యార్థులతో మాట్లాడారు. ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ నుంచి వైస్ చాన్సరల్ కె.ఆర్.రజినీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
తల్లి చెంతకు కుమార్తె
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం ఒకటో పట్టణ పరిధిలోని చంపాగల్లివీధికి చెందిన ఓ మహిళ మతిస్థిమితం సరిగా లేక ఈ నెల 19న పొట్టిశ్రీరాములు పెద్ద మార్కెట్‌లో తప్పిపోయిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ హరికృష్ణ సమీపంలో సీసీ ఫుటేజీలు పరిశీలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆరు బృందాలతో సమీప ఎచ్చెర్ల, రూరల్ మండల పరిధిలోని గ్రామాల్లో గాలింపు చేపట్టారు. వీరిలో ఓ బృందానికి ఎచ్చెర్ల మండలం ఏ.జే.పేట జాతీయ రహదారి పక్కన మహిళ కనిపించడంతో వెంటనే ఆమెను ఒకటో పట్టణ స్టేషన్‌కు తీసుకొచ్చి ఎస్‌ఐ సమక్షంలో తల్లికి అప్పగించారు.
స్విమ్మింగ్ పోటీలో జవహర్‌రాజ్‌కు రజతం
శ్రీకాకుళం: జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో శ్రీకాకుళం నగరానికి చెందిన తంగుడు జవహర్‌రాజ్ రజత పతకం సాధించాడు. ఈ నెల 20, 21 తేదీల్లో మంగుళూరులో నిర్వహించిన ఐదో జాతీయ స్థాయి పోటీల్లో 50 మీటర్ల ఉపరితల ఫిన్ స్విమ్మింగ్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచాడు. నారాయణ ఒలింపియాడ్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న జవహర్‌రాజ్ గతంలో జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి పోటీల్లో సత్తా చాటి విజయాలు అందుకున్నాడు.
కొనసాగుతున్న క్రీడాపోటీలు
ఎచ్చెర్ల: కుశాలపురం పంచాయతీలోని శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న 28వ ఐపీఎస్‌జీఎం క్రీడా పోటీలు మంగళవారం కూడా కొనసాగాయి. ఖోఖో పోటీల్లో విజయమే లక్ష్యంగా క్రీడాకారులు తలపడ్డారు. అనంతరం చిలకపాలెంలోని శ్రీవేంకటేశ్వర కళాశాలలో అథ్లెటిక్స్ 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 1500 మీటర్లు, లాంగ్‌జంప్, హైజంప్, ట్రిపుల్ జంప్, షార్ట్‌ఫుట్, డిస్కస్‌త్రో, జావెలిన్ త్రో 4/100 రిలే, 4/400 రిలే పోఈలు నిర్వహించారు. అన్ని కళాశాలల సిబ్బంది, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
వర్సిటీ విద్యార్థులతో ‘క్వాంటమ్ టాక్’


