కొనసాగుతున్న క్రికెట్ సెలక్షన్ మ్యాచ్‌లు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఫ్యూచర్ క్రికెట్ అండర్–12 బాలుర తుది జట్టు ఎంపిక కోసం జిల్లా క్రికెట్ సంఘం కసరత్తులు చేస్తోంది. త్వరలో జరిగే నార్త్‌జోన్ క్రికెట్ టోర్నీలో జిల్లా జట్టు రాణింపే లక్ష్యంగా ఫైనల్ టీం సెలక్షన్ కోసం ప్రాబబుల్స్ జట్టుకు సెలక్షన్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్ ఆధ్వర్యంలో కళింగపట్నం క్రికెట్ మైదానంలో చిన్నారులకు మంగళవారం ఎంపిక మ్యాచ్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంఘ ప్రతినిధి ఎర్రన్న, చీఫ్ కోచ్ కె.సుదర్శన్, జీఎస్‌ఎస్ ప్రసాద్, ఎం.వి.రమణ, హారికాయాదవ్, రమణమ్మ, సంఘ ప్రతనిధులు పాల్గొన్నారు.
ఎంపిక పోటీలో పాల్గొన్న క్రీడాకారులు


