బోటు నుంచి జారిపడి మత్స్యకారుడు దుర్మరణం
కవిటి : కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు కర్రి విశ్వనాథం (34) సముద్రంలో వేట సాగిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 10 మంది మత్స్యకారులతో కలిసి విశ్వనాథం కొత్తపాలెం తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక బోటుపై నిల్చొని వల వేయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బోటు వేగానికి అదుపుతప్పి వలతో సహా సముద్రంలో పడిపోయాడు. బోటుకు అడుగున ఫ్యాన్ రెక్కలకు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరంమృతదేహాన్ని తోటి మత్స్యకారులు బుధవారం ఒడ్డుకు తీసుకొచ్చారు. విశ్వనాథంకు భార్య ఉమామహేశ్వరి, కుమారులు ప్రసాద్, వినయ్ ఉన్నారు. కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బోటు నుంచి జారిపడి మత్స్యకారుడు దుర్మరణం


