ఈఈగా రాజకీయ ఆఫర్
న్యూస్‌రీల్
శ్రీకాకుళం
● డీఈఈగా రిటైర్
● పడగ విప్పి.. బుసలు కొట్టి
● సమగ్ర శిక్షా ఇంజినీరింగ్ విభాగంలో అక్రమ నియామకం
● డీఈఈ కేడర్‌లో రిటైరైన ఇంజినీర్‌ను ఈఈ పోస్టులో నియామకం
● అడ్డగోలు నియామకం అంటున్న అధికార వర్గాలు
● చక్రం తిప్పిన సీఎంఓ అధికారి సోదరుడు
● టెండర్లను గుట్టుగా నిర్వహించి,
కాంట్రాక్ట్‌లు కొట్టేశారని ఆరోపణలు
మంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
సమగ్ర శిక్షా అభియాన్‌లో రాజకీయ జోక్యం మితిమీరుతోంది. ఏకంగా సీఎంఓ స్థాయి అధికారులు సైతం కలగజేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో జరిగే కార్యకలాపాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సైతం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నియోజకవర్గాల్లో తమకు తెలియకుండానే వ్యవహారాలు నడిచిపోతున్నాయని అంతర్మథనం చెందుతున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ) అదనపు భవన నిర్మాణ కాంట్రాక్ట్‌లను ఉన్నత స్థాయిలో వ్యూహాత్మక టెండర్ల ద్వారా కొందరు వ్యక్తులకు కట్టబెట్టారని లోకల్‌గా చర్చ నడుస్తోంది. ఇటీవల ఆ ఎమ్మెల్యేలంతా ఒకచోట సమావేశమై జరిగిన తంతును అంతర్గతంగా చర్చించుకున్నారు. తాజాగా అదే శాఖలో అడ్డగోలు నియామకం జరిగింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) హోదాలో రిటైరైన వ్యక్తిని ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) హోదాలో నియమించారు. దాని వెనక కూడా ఉన్నత స్థాయి వ్యక్తుల జోక్యం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇదంతా తమకు నచ్చిన విధంగా బిల్లులు డ్రా చేసుకోవడానికి అమలు చేసిన ప్లాన్‌గా తెలుస్తోంది.
కీలక అధికారి సోదరుడి కోటరీకే..
జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంఓలో కీలక అధికారిగా ఉన్నారు. ఆ కీలక అధికారి సోదరుడు జిల్లాలో క్లాస్–1 కాంట్రాక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆ కాంట్రాక్టర్‌కు కొంతమంది కోటరీ కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరందరికీ సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలోని కేజీబీవీల ఆదనపు భవనాల కాంట్రాక్ట్‌లు దక్కాయి. పాతపట్నం, నరసన్నపేట, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో అదనపు భవనాల నిర్మాణ కాంట్రాక్ట్‌లు వచ్చాయి. అయితే, ఈ వర్క్‌ల విషయాలు, జరిగిన టెండర్ల తంతు, కాంట్రాక్ట్ ఒప్పందం తదితర విషయాలేవి స్థానిక ఎమ్మెల్యేలకు తెలియలేదు. పనులు ప్రారంభించేవరకు ఆ ఎమ్మెల్యేలకు తెలియని పరిస్థితి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్నాక సదరు ఎమ్మెల్యేలంతా కంగుతిన్నారు. నియోజకవర్గంలో మనకు తెలియకుండా పనుల కాంట్రాక్ట్‌లు ఖరారు చేయడమేంటి? వాటి విషయమే తెలియకుండా గోప్యంగా ఉంచడమేంటి? ఎమ్మెల్యేలను డమ్మీలుగా చేయడమేంటి? కనీసం మమ్మల్ని సంప్రదించకపోవడమేంటి? అని కొందరు ఎమ్మెల్యేలు ఓ చోట సమావేశమై చర్చించుకోవడం కూడా జరిగింది. అధికార పార్టీలో ఇదొక అంతర్గత వివాదమై చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వ నిధులు కావడం, ఎప్పటికప్పుడు విడుదలయ్యే అవకాశం ఉండటంతో గుట్టుగా రూ.కోట్లు విలువైన కేజీబీవీల కాంట్రాక్ట్‌లను సీఎంఓలో కీలక అధికారి సోదరుడి కోటరీ కొట్టేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. పథకం ప్రకారం టెండర్లలో కొందరినే పాల్గొనేలా చేసి కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నట్టు వాదనలు ఉన్నాయి.
నిర్మాణాలపై అనుమానాలు
వాస్తవంగా కేజీబీవీల అదనపు భవనాల నిర్మాణ పనులు నాణ్యతతో జరగడం లేదని తెలుస్తోంది. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. దీంతో బిల్లులు చెల్లింపుల్లో ఇంజినీరింగ్ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బిల్లుల విషయంలో ఓ ఇంజినీరింగ్ అధికారి కఠినంగా ఉంటున్నారని ఆయనకు సమాంతరంగా అవుట్ సోర్సింగ్ విధానంలో డీఈఈ కేడర్‌లో రిటైరైన ఇంజినీర్‌ను ఈఈ పోస్టులో నియమించారు. ఈ నియామకంలో పెద్ద ఎత్తున చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు మంత్రుల వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న వారితో పాటు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారి ప్రమేయం ఉందని తెలుస్తోంది. అడ్డగోలు నియామకం చేపట్టడమే కాకుండా కఠినంగా ఉన్న ఇంజినీరింగ్ అధికారిని సెలవు పెట్టేసి వెళ్లిపోవాలని ఒత్తిడి కూడా చేస్తున్నారు. అనుకున్న విధంగా ప్లాన్ వర్క్ అవుట్ అయితే నచ్చినట్టుగా బిల్లులు డ్రా చేసుకుని కోటరీ కాంట్రాక్టర్లు కేంద్ర నిధులు మింగేయనున్నారు.
విభిన్న ఆభరణాలు.. సరికొత్త ఆఫర్లు
అడ్డగోలు నియామకం..
తాజాగా ఈ పనులు పర్యవేక్షించే సమగ్ర శిక్షా అభియాన్ ఇంజినీరింగ్ విభాగంలో కీలక అధికారి నియామకం కూడా అడ్డగోలుగా జరిగింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ) కేడర్‌లో రిటైరైన వ్యక్తిని ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) కేడర్‌లో నియమించారు. దీనివెనక ఉన్నత స్థాయి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా రిటైరైన వ్యక్తికి కీలక పోస్టుల్లో నియమించరు. అవసరమైతే అదే కేడర్‌లో నియమిస్తారు. కానీ, అంతకుమించిన పోస్టులో రిటైరైన వ్యక్తిని నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రిటైరైన వ్యక్తితో నచ్చినట్టు చేసుకోవచ్చని, బిల్లులు ఇష్టారీతిన డ్రా చేసుకోవచ్చన్న ఉద్దేశంతో అడ్డగోలు నియామకం చేశారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా రిటైరైన అధికారిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో పలు విచారణలు కూడా జరిగినట్టు సమాచారం. అలాంటి అధికారిని ఏరికోరి, కేడర్‌కు మించి నియమించడం చర్చనీయాంశంగా మారింది. విశేషమేమిటంటే ప్రస్తుతం రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) ఉన్నారు. ఆయన ఉంటూనే కొత్తగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏకంగా జిల్లా పోస్టులో రిటైరైన ఇంజినీర్‌ను కేడర్‌కు మించి నియామకం చేపట్టారు. ఇదంతా అడ్డగోలు వ్యవహారమే.
ఈఈగా రాజకీయ ఆఫర్
ఈఈగా రాజకీయ ఆఫర్
ఈఈగా రాజకీయ ఆఫర్


