ఖాళీ జాగా.. కనిపిస్తే కబ్జా
పలాస: కాశీబుగ్గ సూదికొండ ఎదురుగా పదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం హుద్‌హుద్ ఇళ్లను నిర్మించింది. ఓ శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసి కొంత ఖాళీ స్థలాన్ని కాలనీ వాసుల అవసరార్థం విడిచి పె ట్టారు. ఇంతవరకు వాటిని ప్రారంభించలేదు. ప్రభుత్వం మారడంతో దానిపై అధికారపక్ష నాయకుల కన్ను పడింది. ఇప్పుడు ఆ ఖాళీ స్థలాన్ని కబ్జా చేయడానికి పథకం వేసి రాత్రి పూట పొక్లెయినర్‌తో చదును చేశారు. శిలాఫలకం ఉన్నా ఎలాంటి భయం లేకుండా ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటీ చాలా ఖాళీ స్థలాల పరిస్థితి ఇలాగే ఉంది.


