
గణపతి అనుగ్రహం ఉండాలి
నరసన్నపేట : జిల్లా ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా, ప్రతి ఒక్కరిపై ఏడాదంతా గణపతి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.
ఆమదాలవలస: విఘ్నాలను తొలగించి వినాయకుడు అందరికీ శుభాలు కలిగించాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆకాంక్షించారు. ఈ మేరకు జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
పలాస: హిందువులు సంప్రదాయబద్ధంగా జరుపుకునే వినాయక చతుర్థి అందరికీ మంచి చేకూర్చాలని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ పలాస నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండపాల వద్ద, విగ్రహాల నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గణపతి అనుగ్రహం ఉండాలి

గణపతి అనుగ్రహం ఉండాలి