
జిల్లాలో 360 మి.మీ. వర్షం
● ఎడతెరిపి లేని వర్షంతో వణికిన సిక్కోలు
● జలమయమైన ప్రధాన రహదారులు, కాలనీలు
● నీట మునిగిన పంట పొలాలు
● ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ముంచెత్తిన వరద
● శ్రీకాకుళంలో 52.4 మిల్లీమీటర్ల వర్షం
● నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం
● విద్యుత్ షాక్‌తో ఆవు మృతి
ఆమదాలవలస: మునగవలసలో కనమట చిన్నప్పన్న అనే రైతుకు చెందిన ఆవు మేత కోసం వెళ్లగా సెలూన్ షాపు వద్ద విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందింది. ఆవు విలువ సుమారు రూ.30వేలు నుంచి రూ.40 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు.
గార 11.8
ఇచ్ఛాపురం
12.0
జలుమూరు 22.8
పోలాకి 13.4
రణస్థలం 15.2
లావేరు
18.6
కోటబొమ్మాళి 17.6
టెక్కలి 17.6
నరసన్నపేట 18.2
శ్రీకాకుళం పాతబస్టాండ్: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మంగళవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 360.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఎచ్చెర్ల 28.8
సంతబొమ్మాళి 19.6
ఆమదాలవలస 23.0
శ్రీకాకుళం
52.4
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/శ్రీకాకుళం/శ్రీకాకుళం అర్బన్: వాన దంచికొట్టింది. జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సిక్కోలు జల దిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పీఎన్‌కాలనీ, రైతుబజారు కొత్తరోడ్డు, బలగ, హాస్పిటల్ రోడ్డు, గుజరాతిపేట, ఏపీహెచ్‌బీకాలనీ, హయాతినగరం, అరసవల్లి ఆదిత్యనగర్‌కాలనీ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శ్రీకాకుళం, గార, నరసన్నపేట, రణస్థలం, ఎచ్చెర్ల తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయమైంది. లోతట్టు ప్రాంతం కావడంతో వర్షపునీరు, మురుగునీరు చేరడంతో కోనేరును తలపించింది. మోకాలి లోతు నీరు చేరడంతో నాన్‌స్టాప్ కౌంటర్, కాంప్లెక్స్ పరిసరాలు మొత్తం నీట మునిగాయి. దీంతో ప్రయాణికులు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్దపాడు వద్ద జాతీయ రహదారిపై నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
శ్రీకాకుళం రూరల్: రాగోలు పంచాయతీ రాయిపాడు సమీపంలో మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పంచాయతీ సిబ్బంది, విద్యుత్ అధికారులు యుద్ధప్రాతిపదికన స్తంభాలను మార్చారు.
భోజనాలు పంపిణీ
ఎచ్చెర్ల: తోటపాలేం సమీపంలో నీలమ్మకాలనీ నీట మునగడంతో కాలనీవాసులకు వీహెచ్‌పీ అధ్యక్షుడు ఆనందరావు భోజనాలు సిద్ధం చేశారు. ట్రిపుల్ ఐటీ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల సాయంతో భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్.ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పెద్దింటి ముకుందరావు పాల్గొన్నారు.
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వర్షపు నీటిలో దిగి బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు

జిల్లాలో 360 మి.మీ. వర్షం

జిల్లాలో 360 మి.మీ. వర్షం

జిల్లాలో 360 మి.మీ. వర్షం

జిల్లాలో 360 మి.మీ. వర్షం

జిల్లాలో 360 మి.మీ. వర్షం