
సత్తాచాటిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
ఎచ్చెర్ల: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎచ్చెర్ల ప్రాంగణంలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఈనెల 21వ తేదీ నుంచి 24 వరకు తాడేపల్లిగూడేం, ప్రత్తిపాడుల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగాసనాల పోటీల్లో మూడు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సు కేటగిరీల్లో వివిధ విభాగాల్లో మెడల్స్ సాధించారు. ట్రెడిషనల్ విభాగంలో ఎ.మేఘన ద్వితీయ స్థానం, లెగ్ బ్యాలెన్స్ విభాగంలో ఎన్.జయచంద్ర ద్వితీయ స్థానం, బ్యాక్వార్డ్ బెండింగ్‌లో పి.కారుణ్య బ్రాంజ్, ఆర్టిస్ట్ పెయిర్‌లో కె.మేఘన, ఎ.రాధికలు బ్రాంజ్, సూఫియా విభాగంలో ఈ.భరత్‌సాయి బ్రాంజ్, హ్యాండ్ బ్యాలెన్స్‌లో బి.జోగేంద్రసాయి బ్రాంజ్ మెడల్స్‌తో సత్తాచాటారు. దీంతో విద్యార్థులను కళాశాల సిబ్బంది మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌వో డాక్టర్ మునిరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, డీన్ డాక్టర్ గేదెల రవి, యోగా విభాగాధిపతి డాక్టర్ ఈశ్వరరావు, యోగా విభాగాధిపతి జి.ఈశ్వరరావు, అధ్యాపకులు కె.అర్చన తదితరులు పాల్గొన్నారు.