
సౌండ్ సిస్టం పరికరాలు చోరీ
సారవకోట: మండలంలోని అలుదు గ్రామంలో కొలుమూరు చంద్రశేఖర్‌కు చెందిన రూ.1.20 లక్షలు విలువ చేసే సౌండ్ సిస్టం పరికరాలు చోరీకి గురైయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. కొన్ని రోజులు క్రితం శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాడ గ్రామానికి చెందిన ఒక యువకుడు తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని చెప్పి, పని కల్పించి భోజనం, కొంతకూలి ఇస్తే సరిపోతుందని కోరాడు. దీంతో ఆ యువకుడికి పని కల్పించి పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సప్లయర్స్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖర్ తీసుకెళ్లేవాడు. అప్పటినుంచి నమ్మకంగా ఉంటూ పరికరాలు ఉన్నచోటే రాత్రిపూట పడుకునే వాడు. అయితే ఈ నెల 24న ఆ యువకుడితో ఉన్న మరో యువకుడికి మద్యం తాగించాడు. అనంతరం అర్ధరాత్రి తర్వాత గోడౌన్‌లో ఉన్న సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి రూ.1.20 లక్షలు విలువ కలిగిన సౌండ్ సిస్టం సామగ్రి దొంగిలించుకుని పోయినట్లు ఆయన తెలిపారు. దీనిపై సారవకోట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.