
పరిశోధనలకు
సద్వినియోగం చేసుకోవాలి
ఈనెల 28లోగా సంప్రదించాలి
నైపుణ్యాలను పెంచడమే లక్ష్యం
ప్రోత్సాహం..!
శ్రీకాకుళం న్యూకాలనీ:
పరిశోధనల వైపు పాఠశాల, ఇంటర్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) వారు 9, 10 మరియు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో ప్రోత్సహించడానికి ప్రయాస్ (ప్రమోషకన్ ఆఫ్ రీసెర్చ్ ఆటిట్యూడ్ అమాంగ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ స్టూడెంట్స్) పథకానికి రూపకల్పన చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ, పీజీ(లీడ్) కళాశాలలోని సెంటర్ ఫర్ అప్లయిడ్ సైన్సెస్ విభాగం (బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ), ఇండిజీనస్ సొసైటీ ఫర్ ప్రుగల్ సైన్స్ ఇన్వెన్‌సన్ (ఐఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ)ల ఉమ్మడిగా సహకారంతో ప్రయాస్‌ను విద్యార్థులకు చేరువ చేసేందుకు శ్రీకారం చుట్టారు.
నైపుణ్యాలను పెంచేలా...
పరిశోధనల వైపు ఆకర్షితులుగా ఉన్న విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రయాస్‌ను ఎన్‌సీఈఆర్‌టీ తెరపైకి తీసుకొచ్చింది. యువ, జిజ్ఞాస కలిగిన విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడమే ఈ పథకం ఉద్దేశం. పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించేలా చేసేందుకు ఎంపికై న విద్యార్థుల బృందానికి ప్రాజెక్ట్ సన్నద్ధత, రూపకల్పన చేసేందుకుగాను రూ.50 వేలు నగదు ప్రోత్సాహకాన్ని అందజేయనున్నారు. ప్రస్తుత వాస్తవ ప్రపంచంలో ఉన్న సమస్యలను ఆధారంగా చేసుకొని, వాటికి సృజనాత్మక, శాసీ్త్రయ పరిష్కారాలను చూపించే ఆసక్తి గల విద్యార్థులకు ఈ ప్రయాస్ పథకం చక్కని వేదికగా ఉపయోగపడనుంది. 9వ తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ఆసక్తి గల పాఠశాలలు, కళాశాలల నుంచి ఇద్దరు విద్యార్థులు, ఒక అధ్యాపకుడిని ఒక బృందంగా ఎంపిక చేయనున్నారు. పరిశోధనల వైపు ఆసక్తి కలిగినవారు ఈనెల 28లోగా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల (లీడ్) కళాశాలను సంప్రదించాలని, మరిన్ని వివరాలకు 85559 11961 నంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కణితి శ్రీరాములు సూచించారు.
ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన ప్రయాస్ కార్యక్రమం చాలా గొప్పగా ఉంది. 9, 10 మరియు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ కణితి శ్రీరాములు, ప్రిన్సిపాల్, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల (లీడ్)కాలేజీ
పాఠశాల/కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థులు, ఒక అధ్యాపకుడు బృందంగా ఏర్పడాలి. ఒక వినూత్న ఆలోచనతో కళాశాల అప్లయిడ్ సైన్సెస్ విభాగాన్ని సంప్రదించాలి. ఈ బృందాన్ని ప్రోత్సహించడానికి కళాశాల తరుపున సిద్ధంగా ఉన్నాం. ఈనెల 28లోగా కళాశాలను సంప్రదించాలి.
– డాక్టర్ రోణంకి హరిత, బయో టెక్నాలజీ సీనియర్ లెక్చరర్, ఐఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ కార్యదర్శి
యువ, జిజ్ఞాస కలిగిన విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంపొందించడమే ప్రయాస్ పథకం ముఖ్య లక్ష్యం. ప్రస్తుత వాస్తవ ప్రపంచ సమస్యలను ఆధారంగా చేసుకొని, వాటికి సృజనాత్మకత జోడించి, శాసీ్త్రయ పరిష్కారాలను చూపించడం దీని ఉద్దేశం.
– డాక్టర్ మధమంచి ప్రదీప్, కళాశాల అప్లయిడ్ సైన్సెస్ హెచ్‌వోడీ, ఐఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ అధ్యక్షుడు

పరిశోధనలకు

పరిశోధనలకు

పరిశోధనలకు

పరిశోధనలకు