
దళితులంటే ఎందుకంత చులకన..?
అంత పిరికి కాదు..
మా అక్కను తీవ్రంగా బాధ పెట్టారు. ఆమె తప్పు లేకపోయినా ఇబ్బంది పెట్టడంతోనే ఆత్మహత్య ఆలోచన చేసింది. మా అమ్మ,నాన్న బాగా చదువుకున్న వారు. సమాజంలో గౌరవం కోసమే సౌమ్య ఉద్యోగం చేస్తోంది. మాకు, మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. మాకు రక్షణ కల్పించాలి.
– యువరాజు, సౌమ్య సోదరుడు
శ్రీకాకుళం:
దళిత సామాజిక వర్గానికి చెందిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను వేధించిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఆయన అనుచరుల పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. దళితులన్నా, దళిత మహిళలన్నా చంద్రబాబు అండ్ కోకు చిన్నచూపు అని మండిపడ్డారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సౌమ్యను రిమ్స్‌లో వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం పరామర్శించారు. సౌమ్యకు న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటా మని భరోసానిచ్చారు.ఈసందర్భంగా మేరుగ నాగా ర్జున మాట్లాడుతూ.. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవలే గుంటూరులో ముస్లిం మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుందని తెలిపారు. ఆర్‌అండ్‌బీ ఉద్యోగి కొరప కల్యాణిని మంత్రి అచ్చెన్నాయు డు బూటుకాలితో తన్నారని గుర్తుచేశారు. ఆమదాలవలసలో కోటిపల్లి రాజు అనే వ్యక్తి ఓ చిన్నారిపైన అఘాయిత్యం చేస్తే కేసు కూడా లేదన్నారు. పలాస–కాశీబుగ్గలో ఓ విద్యార్థినిపై దాడి చేస్తే వారిపైనా కేసులు నమోదు చేయలేదన్నారు. పెందుర్తి నియోజకవర్గం జెర్రిపోతులపాలెంలో ఓ మహిళను వివస్త్రను చేస్తే నేషనల్ ఎస్సీ కమిషన్‌కి ఫిర్యాదు చేశాక స్పందించారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో జన సేన ఎమ్మెల్యే దళిత డాక్టర్‌ని చెంపదెబ్బ కొడితే కేసు లు పెట్టలేదన్నారు. నెల్లూరు జిల్లాలో రాంపుర్‌లో పల్లెలో వెలివేసి కొడితే వందల మంది ఊరు వదిలి వెళ్లిపోయారన్నారు. నెల్లూరులో మాజీ శాసన సభ్యు డి ఇంటి మీద దాడి చేస్తే అడిగేవారే లేరన్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ దళితులను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ప్రకారం రాష్ట్రం 4వ స్థానంలో ఉంటే ఇప్పుడు అదే సర్వేలో ఒకటి రెండు స్థానాల్లో ఉండటం సిగ్గుచేటన్నారు. సౌమ్యకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని భరోసానిచ్చారు.
చంద్రబాబు చోద్యం చూస్తున్నారు
వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ జరుగుతున్న సంఘటనలపై సీఎం చంద్రబాబునాయుడు చోద్యం చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న సందర్భాలు లేవన్నారు. రాష్ట్రంలో దళిత అధికారులు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సైతం వదలకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కూ టమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి దళిత, గిరిజన వర్గాల వారంతా సిద్ధంగా ఉన్నారన్నారు.
వైఎస్ జగన్ దళితులకు అగ్రపీఠం వేశారని, ఏనాడూ చిన్నచూపు చూడలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తమ హయాంలో దళితులకు అన్ని రకాలుగా మేలు చేశామని తెలిపారు.
పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ ఓ మహిళగా సౌమ్య పరిస్థితి చూ స్తుంటే బాధగా ఉందన్నారు. దళిత మహిళే హోంమంత్రిగా ఉన్నా దళిత మహిళలకు అన్యాయం జరిగితే కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పో యి తిరిగి తప్పుడు ప్రచారాలు చేయడం తగదన్నా రు. కూన రవి తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేయాలని డిమాండ్ చేశారు.
సౌమ్యను పరామర్శించిన వారిలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, వైఎస్సార్‌సీపీ తూర్పుకాపుకుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పోలినాటి వెలమ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, మాజీ అధ్యక్షుడు పొన్నాడ రుషి, గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షుడు రౌతు శంకరరావు, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, ఎస్సీ సెల్ శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్‌చార్జి యజ్జల గురుమూర్తి, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, బొడ్డేపల్లి రమేష్, గొండు రఘురాం, వైవీ శ్రీధర్, మూకళ్ల తాతబాబు, పీస గోపి, కంఠ వేణు, బోసు మన్మధరావు, జలగడుగుల శ్రీనివాసరావు, పర్రి రాజారావు, పంకు ప్రసాద్, సురారపు త్రినాథ, యలమల కృష్ణ తదితరులు ఉన్నారు.