
uuబాహ్య ప్రపంచానికి దూరం
హిరమండలం: ఎల్‌ఎన్ పేట మండలం దబ్బపాడు గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగి పోయాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడపలవానిగెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో దబ్బపాడు గ్రామ ప్రజలు బయటకు రావడానికి కూడా వీల్లేకుండాపోయింది. ఏటా కడపలవానిగెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో వరద ఉన్న సమయంలో ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇక్కడ వంతెన నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయి. పనులు కూడా అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు. కానీ ఆ పనులను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదు.