
నీరు.. కన్నీరాయె..
రెండున్నరేళ్ల పిల్లాడు.. ఆ నీటి లోపల మునిగిపోతూ అమ్మను ఎంత తలచుకున్నాడో.. నాన్నను ఎంతగా పిలిచాడో. ఊపిరి అందక ఎంత విలవిలలాడిపోయాడో.. ఇంటి పక్కన తీసిన పెంట గొయ్యి ఆ పిల్లాడికి మృత్యు కుహరంలా మారింది. వాన నీటికి నిండిన గోతిలో దాగున్న మృత్యుదేవత చిన్నారిని అమాంతం మింగేసింది. బద్రి గ్రామంలో జరిగిన ఈ విషాద సంఘటనతో ఊరుఊరంతా శోకంలో మునిగిపోయింది.
సారవకోట: మండలంలోని బద్రి గ్రామంలో మంగళవారం పెంట గొయ్యిలో పడి ఆ గ్రామానికి చెందిన శిమ్మ లోకేష్ అనే బాలుడు మృతి చెందా డు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివ రాలు ప్రకారం.. బద్రి గ్రామానికి చెందిన శిమ్మ దాలినాయుడు, హేమలతలకు మౌళి, లోకేష్ ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడైన లోకేష్‌కు 2 ఏళ్ల 4నెలల వయసు ఉంటుంది. మంగళవారం ఉదయం తల్లి హేమలత కుళాయి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లగా ఆమె వెంట బాలుడు కూ డా వెళ్లాడు. ఆ ఇంటి పక్కనే జాతీయ ఉపాధిహా మీ పథకంతో కంపోస్టు ఎరువుల తయారీ కోసం తీసిన పెంట గొయ్యి వాన నీటితో నిండి ఉంది. అమ్మతో వెళ్లిన బాలుడు అటుగా వెళ్లి గోతిలో పడిపోయాడు. దీన్ని ఎవరూ గమనించలేదు. తల్లి నీళ్లు పట్టుకుని కుమారుడి కోసం వెతకగా ఆ గోతిలో మృతదేహం తేలడంతో ఆమె దిగ్భ్రాంతి కి గురయ్యారు. వెంటనే బాలుడిని బయటకు తీ సి బుడితి సీహెచ్‌సీ తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు అక్కడి సిబ్బంది చెప్పడంతో గుండెలవిసేలా రోదించారు. గంట క్రితం వరకు ఇంటిలో అల్లరి చేస్తూ ఆడిన పిల్లాడు అలా చలనం లేకుండా పడి ఉండడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 120 పెంట గొయ్యిలను మూడు నెలల కిందట తవ్వించారు. ప్రస్తుతం వర్షాలకు ఈ పెంట గొయ్యిలు నీటితో నిండి ఉన్నాయి. పిల్లలు అటు గా తిరిగేటప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.
పెంట గోతిలో పడి బాలుడి మృతి
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు

నీరు.. కన్నీరాయె..