
‘దళిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): పొందూరు కేజీబీవీ నుంచి కంచిలి కేజీబీవీకి ప్రిన్సిపాల్ సౌమ్యను అక్రమంగా బదిలీ చేశారని, ఆమెకు న్యాయం జరిగే వరకూ దళిత సంఘాలు ఐక్యంగా పోరాటం చేస్తాయని పలువురు వక్తలు అన్నారు. స్థానిక అంబేడ్కర్ విజ్ఞాన భవన్‌లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కొన్ని అసత్య ఆరోపణలతో బదిలీ చేయడమే కాకుండా, అనేక విధాలుగా వేధించినట్లు సౌ మ్య వెల్లడించిన నుంచి ఆమదాలవలస ఎమ్మె ల్యే కూన రవికుమార్ అనుచరులు సోషల్ మీ డియాలో సౌమ్యపైన ఆమె కుటుంబ సభ్యుల పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ మానసిక క్షో భకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. హోం మంత్రి తక్షణం జిల్లాకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జిల్లా నాయకులు కంఠ వేణు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు రానా శ్రీనివాస్, బొడ్డేపల్లి కృష్ణా, గరికివాడు, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, దళిత ప్రజా సంఘాల జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, బడే కామరాజు, వైఎస్సార్ సీపీ నాయకుడు పొన్నాడ రుషి తదితరులు పాల్గొన్నారు.
పడిగాపులే మిగిలాయి
నరసన్నపేట: ‘మాకేంటీ బాధలు.. మాపై ఎందుకు ఈ కక్ష.. ఇలా ఎన్నాళ్లు తిరుగుతాం. ఇంకెన్నాళ్లు తిరగాలి..’ అని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకల్యం నిరూపించుకోవడానికి రీ వెరిఫికేషన్ కోసం ప్రభుత్వం నోటీసులు పంపిస్తుండడంతో దివ్యాంగులు శ్రమకోర్చి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతో కష్టపడి ఇంటి నుంచి ఆస్పత్రికి వస్తుంటే.. ‘ఇప్పుడు మీకు వైకల్య శాతం తక్కువగా ఉంది. మీ పింఛన్ కట్ చేస్తున్నాం. మీరు అర్హులైతే ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి. మళ్లీ మీకు సదరంకు పిలుస్తాం. అందులో మళ్లీ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. అప్పుడు అర్హులైతే పింఛన్ వస్తుంది’ అని అధికారులు చెబుతున్నారు. మంగళవారం నరసన్నపేట ఎంపీడీఓ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు మడపాం, రావులవలస, సత్యవరం గ్రామాల నుంచి వచ్చారు. కళ్లనీళ్లు పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని నిందించారు.

‘దళిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం’