
uuవంశధారలో పెరిగిన వరద
హిరమండలం: హిరమండలం వంశధార గొట్టా బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయానికి వరద నీరు పెరిగింది. ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాతో పాటు రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు వంశధారలో వరద నీరు వచ్చి చేరుతోంది. గొ ట్టా బ్యారేజీ వద్ద గరిష్ట నీటి మట్టం 38.10 మీటర్లు కాగా ప్రస్తుతానికి 38.08 మీటర్ల వరకు నీరు ఉంది. సోమవారం సాయంత్రానికి 10,357 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. మంగళవారం నాటికి 22వేలకు పెరిగింది. వచ్చిన నీటిని 11 గేట్లు 20 సెంటీమీటర్ల మేర పైకి ఎత్తి 20651 క్యూసెక్కులు దిగువకు విడిచిపెట్టినట్లు డీఈ సరస్వతి తెలిపారు. ఎడమ ప్రధా న కాలువ ద్వారా 1430 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు డీఈ తెలిపారు.