తెంచుకెళ్లిపోతారు! | - | Sakshi
Sakshi News home page

తెంచుకెళ్లిపోతారు!

Aug 20 2025 5:33 AM | Updated on Aug 20 2025 5:33 AM

తెంచు

తెంచుకెళ్లిపోతారు!

● వెనకే వస్తారు..

మహిళలు అప్రమత్తంగా ఉండాలి..

ఒంటరిగా మహిళలు నడిచి వెళ్లేటప్పుడు, ప్రయాణించేటప్పుడు చున్నీ గానీ, చీరకొంగు గానీ కప్పుకునే వెళ్లాలి. ఆభరణాలు కనిపించేలా ఉండరాదు. వెనక, ముందు ఎవరు వస్తున్నారన్నది ఎప్పటికప్పుడు గ్రహించాలి. 45 ఏళ్ల పైబడ్డ మహిళలనే చైన్‌స్నాచర్లు టార్గెట్‌ చేస్తారు. శ్రీకాకుళం పీఎన్‌కాలనీయే కాక పలు చోట్ల విద్యుత్‌ దీపాలు వెలగకపోవడమే కాక సీసీ కెమెరాలు సైతం నివాసగృహాలవారు పెట్టుకోకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నాయి.

– పి.ఈశ్వరరావు, సీఐ, శ్రీకాకుళం టూటౌన్‌

శ్రీకాకుళం క్రైమ్‌ : ఒంటరిగా రోడ్డుపై నడిస్తే భయం.. తోడు లేకుండా పొలానికి వెళ్లాలన్నా వణుకే.. మెడలో బంగారం వేసుకుని బయటకు రావాలంటే సంశయించాల్సిన పరిస్థితి. ఒడిశా గ్యాంగ్‌ చేతివాటానికి సిక్కోలు వాసులు టార్గెట్‌ అవుతున్నారు. నిన్న రణస్థలం.. మొన్న బురిడి కంచరాం.. ఇలా హైవే పక్కన ఉన్న గ్రామాలే లక్ష్యంగా గొలుసు చోరులు రెచ్చిపోతున్నారు. ఈ గొలు సు దొంగతనాలకు పాల్పడుతున్నది ఒడిశాకు చెందిన గ్యాంగ్‌గా ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌కు చెందిన ఇద్దరిపై అనుమా నం ఉన్నట్లు, జిల్లాలో పలు గొలుసు దొంగతనాల్లో వీరి హస్తమున్నట్లు.. వీరికి మరికొందరితో లింకులున్నట్లు అనుమానిస్తున్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఇటీవల జరిగిన ఘటనలు

● ఈ నెల 11న రణస్థలం మండలం అర్జునవలస పంచాయతీ గిడిజాలపేటరహదారిపై ఓ విద్యార్థిని మెడలో చైన్‌ తెంపి పరారయ్యారు.

● ఈ నెల 8న పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు ఎస్‌ఎంపురం రోడ్డులో పొలాన్ని చూడటానికి వెళ్తుండగా వెనుకగా వచ్చిన అగంతకుడు మూడు తులాల తాడు తెంపేసి పారిపోయాడు.

● ఈ నెల 4న ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట పంచాయతీ వరం కాలనీలో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న వరలక్ష్మి మెడలో రెండున్నర తులాల పుస్తెల తాడు తెంపి ఓ వ్యక్తి పరారయ్యాడు.

● గత నెల 15న శ్రీకాకుళం మండలం సింగుపురానికి చెందిన ఓ మహిళ ఏటీఎం సెంటర్‌లో డబ్బులు తీసుకొని వస్తుండగా ముఖానికి మాస్కులు పెట్టిన వ్యక్తులు నంబర్‌ ప్లేట్లు లేని ద్విచక్రవాహనంపై వచ్చి 3 తులాల బంగారు తాడు తెంపేసి పరారయ్యారు.

జైలు నుంచి విడుదలై..

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురానికి చెందిన సుజిత్‌కుమార్‌ పాడి, బాలకృష్ణ సాహులు జిల్లాలో నాలుగుచోట్ల పుస్తెల తాడుల చోరీలకు పాల్పడి ఈ ఏడాది జనవరి 10న కొత్తూరు పోలీసులకు చిక్కి జైలుకెళ్లారు. అప్పటికే జిల్లాలో 2016 నుంచి 2024 వరకు 32 నేరాలు చేసిన ఘనత వీరిది. మళ్లీ బెయిల్‌పై బయటకొచ్చారో లేదో.. ఇదే ఏడాది జూన్‌లో మెళియాపుట్టి మండలం శేఖరాంపురం గ్రామంలోని పొలం పనుల్లో ఉన్న ఓ మహిళ మెడలో పుస్తెల తాడు తెంపేసి బైక్‌పై పరారయ్యా రు. అదేరోజు బరంపురంలో సైతం ద్విచక్రవాహనం దొంగిలించారు. నేరాలు చేసి జైలుకెళ్లినా మళ్లీ దర్జాగా బయటకొచ్చి చోరీలు చేస్తుండటం జిల్లావాసులను విస్మయపరుస్తోంది.

బ్యాగులను తెంపేస్తారు..

● గత నెలలో గార మండలం దీపావళి గ్రామానికి చెందిన ఓ మహిళ పలాసకు బస్సులో వెళ్తుండగా అనకాపల్లికి చెందిన ఓ మహిళ బ్యాగు కొట్టేసింది. అందులో నాలుగున్నర తులాల చైన్‌, తులంన్నర చైన్‌ నెక్లెస్‌ ఉన్నాయి. ఈమె పలు చోరీకేసుల్లో నిందితురాలు.

● గత నెలలోనే జేఆర్‌ పురం మండలకేంద్రంలో వస్త్రదుకాణంలో డ్వాక్రా సభ్యుల వద్ద డబ్బులున్న బ్యాగులను కోసేసి పరారయ్యారు.

● జూన్‌లో ఆటోల్లో ఎక్కే వృద్ధ దంపతులే లక్ష్యంగా ఎచ్చెర్ల, శ్రీకాకుళం రెండో పట్టణ పీఎస్‌ల పరిధిలో కొందరు మహిళలు బ్యాగులు కోసేసి పారిపోయారు. అనంతరం వీరిని పట్టుకున్నారు.

జిల్లాలో మళ్లీ రెచ్చిపోతున్న గొలుసు దొంగలు

నిందితుల్లో చాలా మంది ఒడిశా వాసులే

ఒంటరిగా వెళ్లే వారే టార్గెట్‌

తెంచుకెళ్లిపోతారు! 1
1/1

తెంచుకెళ్లిపోతారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement