
ఇంకేం అర్హత కావాలి..?
దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లపై సర్కారు కన్ను పడింది. ఎలాగైనా లబ్ధిదారుల సంఖ్య తగ్గించాలని రీవెరిఫికేషన్‌పెడుతోంది. ఈ రీ వెరిఫికేషన్‌కు హాజరు కాలేని దివ్యాంగులు తమ పింఛన్ పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. –నరసన్నపేట
నరసన్నపేట మండలం సత్యవరానికి చెందిన బెండి అక్షిత్ స్కూల్లో నాల్గో తరగతి చదువుతున్నాడు. రెండు కాళ్లూ వంకర తిరిగి ఉంటాయి. కొద్ది క్షణాలైనా నించోలేడు. ఈ బాలుడికి ఇదివరకు పింఛన్ వచ్చేది. రీ వెరిఫికేషన్‌లో ఈ బాలుడికి పింఛన్‌కు అర్హత లేదని తేల్చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.ఒకరి సాయం ఉంటే గానీ ముందుకు కదల్లేని తమ బిడ్డ పింఛన్‌కు అర్హుడు కాదా అని ప్రశ్నిస్తున్నారు.
ఇక గొట్టిపల్లి పంచాయతీ రెడ్డికి పేటకు చెందిన కోరెడ్డి మాధవరావుకు పింఛనే జీవనాధారం. ఇతనికి ఒక చెయ్యి, కాలు సక్రమంగా పనిచేయవు. ఏ పనికీ వెళ్లలేరు. ఇంటి పట్టునే ఉంటే పింఛన్ డబ్బుతో బతుకుతున్నారు. గతంలో జెమ్స్ ఆస్పత్రి వైద్యులు గతంలో 57 శాతం వైకల్యం ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు రీ వెరిఫికేషన్‌లో తీసేశారు. మాధవరావుకు ఆధారం ఎలా అని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ఇంకేం అర్హత కావాలి..?