డ్రై‘లేజీ’..! | - | Sakshi
Sakshi News home page

డ్రై‘లేజీ’..!

Aug 17 2025 4:28 PM | Updated on Aug 17 2025 4:28 PM

డ్రై‘

డ్రై‘లేజీ’..!

అధికారులకు తెలియజేశాం

డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నామని, విద్యుత్‌ స్తంభాలు మార్చాలని విద్యుత్‌శాఖ అధికారులకు తెలియజేశాం. స్తంభాలు మార్చడానికి ఖర్చవుతుందని సమాధానం చెప్పారు. దీంతో డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టాం.. రెండు రోజులు వర్షాలు పడడంతో విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి.

– కూచెట్టి కాంతారావు, కాంట్రాక్టర్‌, సంతబొమ్మాళి

ముందు చెప్పలేదు

డ్రైనేజీ తవ్వక ముందు మాకు చెప్పలేదు. తవ్విన తర్వాత తెలియజేశారు. దీంతో వెంటనే పరిశీలించాను. ఆ తర్వాత వర్షాలు రావడంతో విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి పునరుద్ధరించాం. – శశిభూషణరావు,

మండల విద్యుత్‌శాఖ ఏఈ, సంతబొమ్మాళి

సంతబొమ్మాళి: కాంట్రాక్టర్‌ అత్యుత్సాహం, అధికారుల నిర్లక్ష్యం కలగలిపి ప్రజలకు శాపంగా మారింది. మురికి కాలువల నిర్మాణానికి ఇష్టానుసారం తవ్వేయడంతో విద్యుత్‌ స్తంభాలు కూలి విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. సంతబొమ్మాళిలో అర్‌అండ్‌బీ రోడ్డుకు ఆనుకొని మురికి కాలువ నిర్మాణానికి రూ.కోటి 80 లక్షల ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. దీంతో సంబంధిత కాంట్రాక్టర్‌ కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. కాలువ నిర్మాణానికి అడ్డంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ స్తంభాలు ఉన్నాయి. విద్యుత్‌ స్తంభాలు మార్చాలని విద్యుత్‌ శాఖ అఽఽధికారులకు సంబంధిత కాంట్రాక్టర్‌, పంచాయతీ రాజ్‌ అధికారులు తెలియజేశారు. విద్యుత్‌ స్తంభాలు మార్చడానికి ప్రస్తుతం ఫండ్‌ లేదని, ఆ ఖర్చులు మీరే భరించాలని చెప్పడంతో అందుకు వారు అంగీకరించలేదు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్‌ అత్యుత్సాహం ప్రదర్శించి కాలువల నిర్మా ణంలో భాగంగా విద్యుత్‌ స్తంభాలను ఆనుకుని ఉన్న మట్టిని కూడా తీసేశారు. దీనికి తోడు వర్షాలు పడడంతో నాలుగు 33 కేవీ విద్యుత్‌ స్తంభాలు, నాలుగు 11 కెవీ విద్యుత్‌ స్తంభాలు శుక్రవారం రాత్రి నేలకూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. కోటబొమ్మాళి ఫీడర్‌ ద్వారా విద్యుత్‌ సరఫరాను తాత్కాలికంగా అందించారు. ట్రాఫిక్‌ కూడా నిలిచిపోవడంతో ఇతర మా ర్గాల ద్వారా రాకపోకలను సాగించారు. శనివారం ఉదయం విద్యుత్‌ శాఖ డీఈ పర్యవేక్షణలో పనులు చేపట్టి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

విద్యుత్‌ స్తంభం చుట్టూ మట్టిని తవ్వేసి చేపడుతున్న డ్రైన్‌ నిర్మాణం

డ్రైనేజీ నిర్మాణంతో రోడ్డుకు అడ్డంగా కూలిన విద్యుత్‌ స్తంభాలు

ఇష్టానుసారంగా డ్రైనేజీ నిర్మాణం

కూలిన విద్యుత్‌ స్తంభాలు

కాంట్రాక్టర్‌ అత్యుత్సాహం.. అధికారుల నిర్లక్ష్యమే కారణం

డ్రై‘లేజీ’..! 1
1/1

డ్రై‘లేజీ’..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement