
డీఈఓ పోస్ట్ .. భర్తీ ఎప్పుడో..?
శ్రీకాకుళం: శ్రీకాకు ళం జిల్లా విద్యాశాఖ అధికారి నియామకం చేపట్టకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. గత నెల 31న జిల్లా విద్యాశాఖ అధికారి పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. అప్పటి నుంచి ఏ ఒక్కరినీ నియమించేందుకు రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి జిల్లా స్థాయి అధికారి పదవీ విరమణ చేస్తున్నప్పుడు ఓ రోజు ముందుగాను, అదే రోజున వేరొకరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీలు చేయడం పరిపాటి. అలాంటిది అత్యంత కీలకమైన విద్యాశాఖ అధికారి పోస్టును 17 రోజులుగా భర్తీ చేయకుండా ఉంచేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తుండగా కీలక దశలో డీఈఓ పోస్టు ఖాళీగా ఉండడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. వేరొకరిని నియమించే వరకు పూర్తి అదనపు బాధ్యతలతో మరొకరిని నియమించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా కూడా చర్యలు చేపట్టలేదు. బీఈడీ డిగ్రీ లేని ఓ ఏడీకి నామమాత్రంగా బాధ్యతలు ఇచ్చేశారు. డైట్‌లో సీనియర్ లెక్చరర్లతో పాటు బీఈడీ పూర్తి చేసిన ఉప విద్యాశాఖాధికారులు ఉన్నా వారిని నియమించలేదు. జిల్లాలో కీలక భూమిక పోషి స్తున్న ఓ ప్రజా ప్రతినిధి తనకు కావాల్సిన వారిని నియమించేందుకే ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించకుండా, కొత్తవారిని నియ మించకుండా అడ్డుకుంటున్నారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఆ నాయకుడు ఆలోచిస్తున్న వ్యక్తి బీఈడీ పూర్తి చేయకపోవడంతో ఆ డిగ్రీ పూర్తయ్యే వరకు ఇలా అడ్డుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆ వ్యక్తి ఇటీవలే బీఈడీ పరీక్షలు రాయగా, ఫలితాలు వచ్చేందుకు మరో వారం పది రోజులు పడుతుందని అప్పటివరకు విద్యాశాఖ అధికారి పోస్టు భర్తీ జరగదని విద్యాశాఖ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నా యి. కీలకమైన జిల్లా విద్యా శాఖ అధి కారి పోస్టు ఇన్ని రోజులు భర్తీ చేయకుండా ఉండడం జిల్లా చరిత్రలో ప్రథమ మని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారిని నియమించని ప్రభుత్వం
కీలక సమయంలో కొరవడిన పర్యవేక్షణ
పేరుకు పోతున్న ఫైళ్లు