శ్రీకాకుళం: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. అర్హత గల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారుల ద్వారా దరఖాస్తులు సమర్పించా లని సూచించారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను సంబంధిత ఉప విద్యాశాఖాధికారులకు మాత్రమే సమర్పించాలన్నారు. నిర్ణీత దరఖాస్తుల న మూనాలు అన్ని మండల విద్యాశాఖ అధికారుల వద్ద ఉన్నాయని, మరిన్ని వివరాలకు 9492423420 సంప్రదించాలని సూచించారు.
వైఎస్సార్‌సీపీ పోలినాటి వెలమ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా అంబటి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్ సీపీ పోలినాటి వెలమ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా శ్రీకాకుళం నియోజకవర్గం సీనియర్ నేత అంబటి శ్రీనివాసరావు నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం శనివా రం సాయంత్రం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. అంబటి ఇదివరకు వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. గతంలో రెండు సార్లు ఎంపీపీగానూ పని చేశారు. సర్పంచ్‌గా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం ఈయన భార్య ఎంపీపీగా కొనసాగుతున్నారు. అధినాయకుడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సహకారంతో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని ఆయన తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసుకునేంతవరకు అలుపెరగకుండా శ్రమిస్తానని, తనకు పదవి రావడానికి దోహద పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాన ని పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గురునాథ్ యాదవ్
టెక్కలి: వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టెక్కలికి చెందిన గద్దిబోయిన గురునాథ్ యాదవ్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. టెక్కలిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన గురునాఽథ్ యాదవ్ యాదవ సామాజిక వర్గం రాష్ట్ర అధ్యక్షునిగా, అహిర్ సంఘానికి అధ్యక్షునిగా ప్రస్తుతం సేవలు అందజేస్తున్నారు. బీసీ సెల్ విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు, నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.