
జిల్లాలో జోరుగా వానలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు 365.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉదయం 8 గంటలకు 203.8 మిల్లీమీటర్లు, 8 నుంచి ఒంటి గంటల వరకు మరో 35.4 మిల్లీమీటర్లు, ఒంటి గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు 128.4 మిల్లీమీటర్ల వాన పడింది. ఎక్కువగా సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురంలో వర్షం కురిసింది.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్..
జిల్లాలో కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. నదీతీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో 08942 220557 నంబర్‌ను ఉంచారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్లతో పాటు 30 మండలాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

జిల్లాలో జోరుగా వానలు