
స్వేచ్ఛా గీతిక
న్యూస్‌రీల్
శ్రీకాకుళం
తప్పిన ప్రమాదంపొందూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. పిల్లలతో ఉన్న ఆటో బోల్తా పడింది. –8లో
సమరయోధుల స్ఫూర్తితో సంక్షేమం
ప్రదర్శనలు అద్భుతః
● ఆర్ట్స్ కాలేజీ మైదానంలో
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
● ఆకట్టుకున్న ప్రదర్శనలు
● మంత్రి అచ్చెన్నాయుడు
పట్ట పగలు మూడు రంగుల వెన్నెల కురిసింది. ‘వందేమాతరం’ అని విన్న ప్రతి సారీ జనం గుండె ఝల్లుమన్నది. ‘జనగణమన’ జనగళమున సగర్వంగా పలికింది. జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో పంద్రాగస్టు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. విద్యార్థుల ప్రదర్శనలు, శకటాల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుతో ఉత్సవం ఉత్సాహంగా జరిగింది.
శ్రీకాకుళం పాతబస్టాండ్:
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగస్ఫూర్తితో రాష్ట్రంలో ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్థక, డైరీ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని, నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమ లు చేస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. దీపం–2 కింద మొదటి విడతగా 4,35,037 మందికి రూ.33.34 కోట్లు, రెండో విడత కింద 4,08,740 మందికి రూ.36.41 కోట్లు ఖాతాలో జమ చేశామన్నారు. అరసవల్లి రథసప్తమి, కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి వైభవంగా జరుపుకున్నామని తెలిపారు. జిల్లా ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించుకున్నామని పేర్కొన్నారు. జిల్లా రైతులను వాణిజ్య పంటల వైపు మరల్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యాంత్రీకరణతో పాటు బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఖరీఫ్–2025కు 1,62,995 హెక్టార్లు సాగు లక్ష్యం కాగా నేటి వరకు 1,28,411 హెక్టార్లలో సాగు చేస్తున్నట్లు తెలిపారు. తీర మత్స్యకార గ్రామాల పథకం కింద మన జిల్లాలో పెదగనగళ్లవానిపేట, ఇద్దివానిపాలెం, దేవునల్తాడ గ్రామాలను ఎంపిక చేసి ఒక్కో గ్రామానికి రూ.2 కోట్ల చొప్పున మంజూరు చేశామని తెలిపారు. 3.10 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టామని, తేలినీలాపురం, తేలుకుంచి వంటి కీలక విదేశీ వలస పక్షుల సంరక్షణ కేంద్రాల్లో 5,133 వలస పక్షులను, 2,215 పక్షి పిల్లల గూళ్లను సంరక్షించామన్నారు.
జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచామని, విజయనగరం, విశాఖ అవసరాలకు కూడా తరలిస్తున్నామని వివరించారు. 2025–26లో ఇప్పటి వరకు రూ.38 కోట్ల పెట్టుబడితో 1231 పరిశ్రమల ద్వారా 4563 మందికి ఉపాధి కల్పించామన్నారు. జిల్లాలో 543 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి చర్యలు తీసుకొని మెరిట్ లిస్టును కూడా ప్రకటించామని చెప్పారు. జిల్లాలో 2 లక్షల 50 వేల మంది పిల్లలకు తల్లికి వందనం జమచేశామని తెలిపారు. యోగాంధ్ర సందర్భంగా జిల్లాలో 2,72,677 మంది విద్యార్థులు, 11,976 మంది ఉపాధ్యాయులతో కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును నెలకొల్పామని గుర్తు చేశారు. జిల్లాలో 3129 గ్రామాల్లో 12,808 చేతి పంపులు ఉండగా 1909 గ్రామాలకు పైప్ లైన్ ద్వారా తాగునీరు అందిస్తున్నామని వివరించారు. జిల్లాలోని మొత్తం 912 గ్రామ పంచాయతీలు బహిరంగ మలవిసర్జన రహిత స్థాయిని చేరుకున్నాయని చెప్పారు. జిల్లాలో 4.41 లక్షల ఉపాధి హామీ వేతనదారులకు ఈ ఏడాది రూ.318 కోట్ల వేతనాలు చెల్లించి వారికి 135 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్,ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి , జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, డీఆర్‌ఓ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట ఎమ్మెల్యేలు గొండు శంకర్ రావు, ఎన్.ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, జిల్లా అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ సింధూర్ పై విద్యార్థుల ప్రదర్శన
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శ్రీకాకుళం పాతబస్టాండ్, శ్రీకాకళం పీఎన్ కాలనీ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ (పురుషుల) కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పీఎన్ కాలనీలోని న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు ఆపరేషన్ సింధూర్‌పై నిర్వహించిన ప్రదర్శన అబ్బురపరిచింది. ఆర్‌సీఎం లయోలా విద్యార్థులు ప్రదర్శించిన నమో నమః భారత ప్రదర్శన ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన జయతు జయతు భారతం అలరించింది. ఐటీడీఏ పోస్టు మెట్రిక్ హాస్టల్ విద్యార్థుల థింసా నృత్యం, గార కేజీబీవీ విద్యార్థుల నృత్య విన్యాసం ఆకట్టుకున్నాయి. అరసవల్లి బాల సదనం విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శన ఆలోచింపజేసింది. వీరిలో న్యూసెంట్రల్ స్కూల్‌కు మొదటి బహుమతి దక్కగా, శ్రీచైతన్య టెక్నో స్కూల్ రెండో బహుమతి, ఆర్‌సీఎం లయోలా, గార కేజీబీవీ విద్యార్థులకు మూడో బహుమతి సంయుక్తంగా లభించాయి. శకటాల ప్రదర్శనలో విద్యాశాఖ శకటానికి మొదటి బహుమతి, వ్యవసాయ శాఖకు రెండో బహుమతి రాగా, మూడో బహుమతిని వైద్య ఆరోగ్యశాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సంయుక్తంగా గెలుచుకున్నాయి. స్టాల్స్ ఆకట్టుకున్నాయి.

స్వేచ్ఛా గీతిక

స్వేచ్ఛా గీతిక