
ఉత్సాహంగా వజ్రోత్సవ పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయి న సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, చిత్రలేఖనం పోటీలు గురువారంతో ముగిశాయి. నియోజకవర్గ స్థాయిలో 75 మందిని ఎంపిక చేసి తుది పోటీలు ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు.
విజేతలు వీరే..
వ్యాసరచన: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని కె.నక్షత్ర ప్రథమ, టెక్కలి విశ్వ జ్యోతి జూనియర్ కళాశాల విద్యార్థిని జె.ఇందు ద్వితీయ, ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి ఎం. మేఘరాజ్ తృతీయ స్థానాలు సాధించారు.
డిబేట్: చాపర ఎస్‌కేకే జూనియర్ కళాశాల విద్యార్థి ని ఏ.ప్రియాంక, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి జి.శ్రావణి, సారవకోట కార్మెల్ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎన్.రుతో తొలి మూడు స్థానా లు సాధించారు.
చిత్రలేఖనం: ఆమదాలవలస ఎంజేపీ ఏపీబీసీ డబ్ల్యూ కళాశాల విద్యార్థిని పి.ధనశ్రీ ప్రథమ, పలా స శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని టి. జ్యోత్స్న ద్వితీయ, నౌపడా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని బి.దీపిక తృతీయ బహుమతి గెలుచుకున్నారు. విజేతలను రీజనల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ ప్రగడ దుర్గారావు, జిల్లా ఉపాధి కల్పనాధికారి కొంతలెంక సుధ అభినందించారు.