
● గుండెపోటుతో రైతు మృతి ● లావేరులో విషాదం
ప్రజాస్వామ్యం అపహాస్యం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ గురువారం అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు మరీ దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరగడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. పక్క మండలాలకు చెందిన టీడీపీ గూండాలను తీసుకొచ్చి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఇంతటి దారుణమైన ఘటనలు జరిగినా ఎన్నికలు కమిషన్, పోలీసు యంత్రాంగం ఏమీ తెలియనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు గుర్తించి అక్రమాలకు ఒడిగట్టారన్నారు.
హిరమండలం: టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు పై ఉద్యోగులు గురువారం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగు ల సంఘం పిలుపు మేరకు గాంధేయవాదం ప్రదర్శించారు. హిరమండలంలోని వంశధార ప్రాజెక్టు కట్టడాల విభాగం వద్ద ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాల నుంచి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, న్యాయబద్ధ చెల్లింపులు, ప్రభుత్వ హామీలపై చర్చించా రు. ప్రభుత్వం స్పందించే వరకూ ఐక్య పోరాటాలు చేద్దామని నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం హిరమండలం తాలుకా యూనిట్ అధ్యక్షుడు మీసా ల వరప్రసాదరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగ్గి లి కళ్యాణ్, జాయింట్ సెక్రటరీ పైడి రవికుమా ర్, పిసిని రమేష్, టింగ మనోజ్, పైల వెంకట రమణ, రామకృష్ణ, నడిమింటి షన్ముఖరావు, వసంతరావు,రేగేటి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
రణస్థలం: లావేరుకు చెందిన ఎచ్చెర్ల గొల్ల (50) అనే రైతులు గుండెపోటుకు గురై పొలంలోనే మృత్యువాతపడ్డాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. లావేరు చెందిన గొల్ల అనే రైతు తాను కౌలుకు తీసుకున్న పొలానికి నీరు కడదామని గురువా రం మధ్యాహ్నం వెళ్లాడు. వ్యవసాయ బోరు రిపేర్ కావడంతో మెకానిక్ ను పిలిపించి బాగు చేయించాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో వరి పొలానికి నీరు కడుతుండగా గుండెపోటు వచ్చి వరిచేనులో పడిపోయాడు. విగత జీవిగా పడి ఉన్న రైతును స్థానికులు గుర్తించి లావేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి వరకు అందరితో కలిసి మెలిసి ఉండే గొల్ల ఆకస్మాత్తుగా చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈయన వ్యవసాయ పను లు లేనప్పుడు రణస్థలం జాతీయ రహదారిపై బస్టాప్ వద్ద చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య భాగ్యలక్ష్మి కుమార్తె స్వరూప, కుమారుడు రామకృష్ణ ఉన్నారు.
సెప్టెంబర్ 13న లోక్ అదాలత్
శ్రీకాకుళం పాతబస్టాండ్ : కక్షిదారులు వివాదాలను త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ ఉత్తమ వేదికగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. సెప్టెంబర్ 13న జరగబోయే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కువ కేసులు రాజీ చేయడానికి బీమా సంస్థలు, న్యాయవాదులు చొరవ తీసుకోవాలని సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు భవనంలో బీమా సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. వివాదాలు త్వరగా పరిష్కరించడానికి అదాలత్ మేలు చేస్తుందన్నారు. సమావేశంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.సువర్ణ రాజు, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

● గుండెపోటుతో రైతు మృతి ● లావేరులో విషాదం

● గుండెపోటుతో రైతు మృతి ● లావేరులో విషాదం

● గుండెపోటుతో రైతు మృతి ● లావేరులో విషాదం