
మహాత్ముడి పేరు
దూసి రైల్వేస్టేషన్‌కు కలగా మిగిలిన గాంధీ పేరు
రెండు దశాబ్దాలుగా నెరవేరని పేరు మార్పు
కనీస అభివృద్ధికి నోచుకోని వైనం
ఆమదాలవలస రూరల్: స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం సమయంలో దూసి రైల్వేస్టేషన్‌లో జాతిపిత మహాత్మా గాంధీ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో దూసి రైల్వేస్టేషన్‌కు మహాత్మాగాంధీ పేరు పెట్టేందుకు నేతలు హామీ ఇచ్చి నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దూసి రైల్వేస్టేషన్‌ను గాంధీజీ రైల్వేస్టేషన్‌గా పేరు మార్చేందుకు 2002లో అప్పటి కేంద్ర సహాయ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరికొందరు నాయకులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర రైల్వేశాఖ నుంచి అనుమతులు వస్తాయని ఆశించారు. అయినా ఫలితం లేకపోయింది. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్‌నాయుడు పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందట మే కాకుండా ప్రస్తుతం కేంద్రంలో పౌరవిమయా న శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. తన తండ్రి ఇచ్చిన హామీ నెరవేర్చటంలో పూర్తిగా విఫలమయ్యారు. వీరే కాకుండా కాంగ్రెస్ పాలనలో కిల్లి కృపారాణి కూడా కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. మరికొందరు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. అయినా గాంధీజీ నామకరణం చేయటంలో మాత్రం విఫలమయ్యారు.
పేరు తొలగించినా...
రైల్వేశాఖ నుంచి అప్పట్లో అనుమతులు వస్తాయని నాయకులు ఎంతో నమ్మకంగా చెప్పటంతో స్థానిక రైల్వేశాఖ అధికార్లు దూసి రైల్వేస్టేషన్ పేరును తొలగించారు. తర్వాత ఏ విషయం చెప్పకపోవడంతో పేరు లేకుండానే స్టేషన్ దర్శనమిస్తోంది. అదే విధంగా, స్టేషన్ పరిధిలో గాంధీజీ విగ్రహాం ఏర్పాటు చేసేందుకు రైల్వే ప్లాట్‌ఫాంలో గోతులు తవ్వారు. అయితే నామకరణానికి అనుమతి రాకపోవటంతో పతాక ఆవిష్కరణ, రచ్చబండ నిర్మాణంతో సరిపెట్టుకున్నారు.
మారని స్టేషన్ దుస్థితి..
దూసి రైల్వేస్టేషన్ అభివృద్ధికి ఆమడ దూరంగానే నిలిచిపోయింది. ప్రయాణికులకు కనీస సౌకరా లు లేక అవస్థలు పడుతున్నారు. ఫ్లై ఓవర్, కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి దూసిస్టేషన్‌కు గాంధీ పేరు పెట్టడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

మహాత్ముడి పేరు