
కనిమెట్ట
పోరాటయోధుల పురిటిగెడ్డ..
పొందూరు:
జిల్లాలో స్వాతంత్య్ర సమరయోధుల గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గుర్తుకొచ్చే గ్రామాల్లో పొందూరు మండలం కనిమెట్ట ఒకటి. ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు.., మా కొద్దీ తెల్లదొరతనం’ వంటి స్వరాజ్య గీతాలతో హోరెత్తించిన ఆ పల్లె స్వాతంత్య్ర యోధుల ఖిల్లాగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలిచింది. పది మంది స్వాతంత్య్ర సమరయోధులకు జన్మనిచ్చిన పల్లెగా కనిమెట్ట చరిత్ర పుటల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది. నంద కృష్ణమూర్తి, నంద ఆదినారాయణ, కూన ఎర్రయ్య, కూన అప్పలసూరి, కూన బుచ్చయ్య, గురుగుబెల్లి సత్యనారాయణ, బొడ్డేపల్లి రాములు, బొడ్డేపల్లి నారాయణ, అన్నెపు అప్పయ్య, నంద నర్సయ్యతో పాటు వారి ప్రధాన అనుచరులు 1942 ఆగష్టు 9 నుంచి ఆ ఏడాది చివరి వరకు జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గోని అరెస్టయ్యారు. కనిమెట్ట స్వాతంత్య్ర యోధులు కళింగపట్నం తపాలా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. విజయనగరం, పలాస, బ్రాహ్మణ తర్ల తదితర చోట్ల నిర్వహించిన సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొని లాఠీదెబ్బలు తిన్నారు. విజయనగరం, చీపురుపల్లి, నరసన్నపేట, బళ్లారి జైళ్లలో నిర్బంధానికి గురయ్యారు. గాంధీజీ దూసి రైలు నిలయంలో బహిరంగ సభ నిర్వహించినపుడు జన సమీకరణ చేసి తమ వంతు బాధ్యత నిర్వహించారు. చౌదరి సత్యన్నారాయణ సారధ్యంలో వీరంతా ఉద్యమానికి బాసటగా నిలిచారు. గౌతు లచ్చన్నను నిర్భందించేందుకు ఆంగ్లేయులు సమాయత్తం కావడంతో ఈ యోధులంతా తోలాపి, షేర్ మహ్మద్‌పురం గ్రామాల్లోని రహస్య స్ధావరాల్లో దాచిపెట్టారు. అలాగే ఆచార్య ఎన్‌జి రంగాకు కూడా కొన్ని రోజుల పాటు ఈ ప్రాంతంలో రహస్యంగా ఆశ్రయం కల్పించారు.

కనిమెట్ట

కనిమెట్ట

కనిమెట్ట

కనిమెట్ట