
● ఉత్సాహ తరన్‌గం
శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మూడు రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి ఏడురోడ్ల కూడలి వరకు వాక్ థాన్ పేరిట చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారు ముఖ్యంగా విద్యార్థులు, యువత జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం వరకు జరిగే ఉత్సవాలు, సాంస్కృతిక ప్రదర్శనలను విజయవంతం చేయాలని కోరారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ 75 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని సగర్వంగా జరుపుకొందామన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.