
‘ఉద్దానంలో విధ్వంసం సహించబోము’
మందస: కార్గో ఎయిర్ పోర్టు పేరుతో ఉద్దానంలో విధ్వంసం చేస్తే సహించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా ఎం.గంగువాడ నుంచి రాంపురం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ కార్గో ఎయిర్ పోర్టు పేరుతో బలవంతంగా భూములు తీసుకోవడం వల్ల ఇక్కడి ప్రజలు నిరాశ్రయులవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అతిపెద్ద ఎయిర్‌పోర్టు అయిన ఢిల్లీ కార్గో ఎయిర్ పోర్టుకి కేవలం 150 ఎకరాలు మాత్రమే ఉందని ఇక్కడ కార్గో ఎయిర్ పోర్టుకి 1400 ఎకరాలు ఎవరి ప్ర యోజనం కోసం కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో ప్రముఖ ఎయిర్‌పోర్టులకు అనుంబంధంగానే కార్గో ఎయిర్‌పోర్టులు ఉన్నాయని, ఇక్కడెందుకు ప్రత్యేకంగా కార్గోను నిర్మిస్తున్నారని నిలదీశారు.