
రాష్ట్రస్థాయి డిబేట్‌లో ‘గంగోత్రి’కి ప్రథమస్థానం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్)కళాశాలకు చెందిన బీకాం ఒకేషనల్ ఫైనలియర్ విద్యార్థిని జె.గంగోత్రి రాష్ట్రస్థాయి డిబేట్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. సమాచార హక్కు చట్టం–2005 ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ పోటీల్లో.. కాలేజీ స్థాయి నుంచి ఎన్‌ఆర్సీ, జోనల్ స్థాయిల్లో విజయం సాధించిన గంగోత్రి రాష్ట్రస్థాయిలోనూ మొదటిస్థానంలో నిలిచి స్టేట్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ పి.శామ్యూల్ చేతుల మీదుగా బహుమతిని అందుకుంది. ఈ సందర్భంగా కళాశాలకు చేరుకున్న విద్యార్థినిని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు అభినందించారు. కార్యక్రమంలో కామర్స్ శాఖాధిపతి లబ్బ కృష్ణారావు, అధ్యాపకులు లలితబాయి, సంతోషి, ఎస్.మాధవీలత, వాణీ కుమారి తదితరులు పాల్గొన్నారు.
5,03,800 డోసుల పంపిణీకి చర్యలు
అరసవల్లి: జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు నులిపురుగుల నివారణకు గాను ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా వేసుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలియజేశారు. డీవార్మింగ్ డే సందర్భంగా మంగళవారం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆయన స్వయంగా మాత్రలను పంపిణీ చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా శారీరక, మానసిక ఎదుగుదల లోపాలకు గురవుతారని గుర్తుచేశారు. డీఎంహెచ్‌ఓ అనిత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5,03,800 డోసులు మాత్రల పంపిణీకి చర్యలు చేపట్టామని వివరించారు. బడిబయట ఉన్న వారికి కళాశాలకు వెళ్లని వా రికి ఈనెల 20న మాప్‌అప్ డే నిర్వహిస్తున్నామని ఆమె ప్రకటించారు.

రాష్ట్రస్థాయి డిబేట్‌లో ‘గంగోత్రి’కి ప్రథమస్థానం