ప్రాణదాతలకు సలాం! | - | Sakshi
Sakshi News home page

ప్రాణదాతలకు సలాం!

Aug 13 2025 7:28 AM | Updated on Aug 13 2025 7:28 AM

ప్రాణదాతలకు సలాం!

ప్రాణదాతలకు సలాం!

పునర్జన్మ

అవయవదానం మహోన్నతమైనది. ఒకరు దానం చేస్తే 8 మందికి పునర్జన్మ దక్కుతుంది. జిల్లాలో అవయవదానాలు పెరుగుతుండడం శుభపరిణామం. అయితే చాలామందిలో అపోహలు ఉన్నాయి. అయితే ఆపదకాలంలో ఉన్నవారికి తమవారి అవయవాలు దానం చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపవచ్చు. – ఫారుక్‌ హూస్సేన్‌,

వైద్యాధికారి, హిరమండలం పీహెచ్‌సీ

జూలై 29న కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జంక్షన్‌కు చెందిన పినిమింటి శ్రీరామ్‌ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే రాగోలు జెమ్స్‌కు తీసుకొచ్చారు. ఆయన బ్రెయిన్‌డెడ్‌ కావడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. గ్రీన్‌చానెల్‌ ద్వారా అవయవాలను తరలించారు.

ఈ నెల 7న ఒడిశాలోని రాణిపేట గ్రామానికి చెందిన లెంక రవణమ్మ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. కుటుంబసభ్యులు రాగోలు జెమ్స్‌కు తీసుకురాగా బ్రెయిన్‌డెడ్‌గా చెప్పారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆమె అవయవదానానికి అంగీకరించారు. దీంతో గ్రీన్‌చానెల్‌ ద్వారా అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement