
శ్రీకాకుళం
ఆగిన ఆశల సౌధంపేదల కల కలగానే మిగిలిపోతోంది. కూటమి ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. –8లో
కొండను కొల్లగొడుతున్నారు
మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025
● 75 ఏళ్ల శ్రీకాకుళం జిల్లా ●సరిగ్గా స్వాతంత్య్ర దినోత్సవం నాడే జిల్లా అవతరణ
ఈ నేలకు గర్జించడం తెలుసు. ఈ మట్టికి శాంతి ప్రబోధించడం తెలుసు. ఈ గడ్డకు రోదించడం తెలుసు. ఈ భూమికి ఎదురించడమూ తెలుసు. శ్రీకూర్మ క్షేత్ర వైభవాన్ని ఈ ప్రాంతం చూసింది. శ్రీకాకుళం సాయుధ పోరాటానికి ఊపిరి పోసింది. అపురూప ఆదిత్య ధామంగా విరాజిల్లింది.
జనం అమాయకులనే అపవాదును తరాల తరబడి మోసింది. గిడుగు వారి హయాం నుంచి అక్షరాన్ని కాపాడుతోంది. 75 ఏళ్లకు పూర్వం ఓ సూర్యాస్తమయాన ‘శ్రీకాకుళం’ పురుడు పోసుకుంది. 75 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఉత్థానపతనాలు చూసింది. కాలం రాసిన శ్రీకాకుళం కథ ఎప్పటికీ నిత్య నూతనమే.
ఆ కాలాన్ని ఓ సారి వెనక్కి తిప్పితే.. – అరసవల్లి
నాటి జిల్లా కలెక్టర్ కార్యాలయం (ప్రస్తుతం జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న పాత భవనం)
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రత్యేక జిల్లాల కోసం ఉద్యమాలు పలు చోట్ల జరిగాయి. ప్రత్యేకంగా ఆంఽధ్ర ప్రాంతంలో అప్పటి వరకు వైజాగ్ జిల్లాలో భాగంగా ఉన్న శ్రీకాకుళంను ప్రత్యేక జిల్లా చేయాలంటూ 1948 నాటికే ఈ ప్రాంత నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. 1948 ఫిబ్రవరిలో శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా..జిల్లా కేంద్రం ఎంపికలో మాత్రం జాప్యం జరిగింది. ఈ క్రమంలో 1950 జులైలో అప్పటి రెవెన్యూ మంత్రి హెచ్.సీతారామ రెడ్డి శ్రీకాకుళంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 1950 ఆగస్టు 15న సూర్యాస్తమయ సమయంలో పెట్రో మాక్స్ లైట్ల వెలుగులో శ్రీకాకుళం అవతరించింది. 1950 ఆగస్టు 15న సాయంత్రం 4.30 గంటల సమయంలో జిల్లా అవతరణ కార్యక్రమానికి కలెక్టర్ షేక్ అహ్మద్ తన నివాసం నుంచి ప్రస్తుతం జిల్లా కోర్టు భవన సముదాయంలో ఉన్న కలెక్టర్ కార్యాలయానికి బయల్దేరారు. దారి మధ్యలో ఆయన వాహనం చెడిపోవడంతో మరో వాహనంలో ఎక్కి వచ్చేసరికి సూర్యాస్తమయమై చీకటి అలముకుంది. అప్పటికప్పుడు పెట్రోమాక్స్ లైట్లలో అవతరణ కార్యక్రమాన్ని నాటి కలెక్టరేట్ (నేడు జిల్లా కోర్టు పాత భవనం) వద్ద ఘనంగా జరిపించారు. వేలాది మంది శ్రీకాకుళం వాసులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు జిల్లా ఆవిర్భావ దినోత్సవం జరిపే అపురూప అవకాశం దక్కింది.
ఉద్యమాల గడ్డగా ప్రసిద్ధి గాంచిన శ్రీకాకుళం జిల్లా అవతరించి 75 వసంతాలు పూర్తయ్యాయి. సామాజికంగా, రాజకీయంగా ఎంతో చరిత్ర కలిగిన శ్రీకాకుళం జిల్లా అవతరణ వెనుక ఎంతో ఘన చరిత దాగుంది.
●కుతుబ్‌షాహీల పాలనలో ‘చికాకోల్’ ఫౌజ్‌దారీ కేంద్రంగా ఏర్పాటైంది. దీని పరిధిలో ప్రస్తుత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒడిశాలోని కొన్ని ప్రాంతాలుండేవి. 1758లో విజయనగర జమిందార్ ఒత్తిడిపై ఇంగ్లిష్ సైన్యం తొలిసారి విశాఖపట్నంలో అడుగు పెట్టింది.
●1759లో ఫౌజ్‌దారీ పాలనను అంతం చేసి బ్రిటిష్ పరిపాలన ప్రారంభమైంది.
●1769 జూలై 27న ‘వైజాగ్ పట్నం’ పేరుతో వారు ఒక జిల్లాను ప్రకటించి, జిల్లా కేంద్రంగా విశాఖపట్నాన్ని ప్రకటించుకున్నారు. ఈ కొత్త జిల్లాలో ప్రస్తుత ఉత్తరాంఽధ్రతో పాటు ఒడిశాలోని గంజాం జిల్లా దక్షిణ భాగం కూడా చేర్చారు.
●అప్పట్లో దేశంలోనే ఇదో అతి పెద్ద జిల్లాగా గుర్తింపు పొందింది. 1801లో కలెక్టర్ల పాలన జిల్లాలో ప్రారంభమైంది. భాష పేరుతో దేశాన్ని విభజించి పాలించడానికి బ్రిటిష్ పాలకులు నిర్ణయించి, 1936లో ఉమ్మడి మద్రాస్–ఒడిశా రాష్ట్రాలను విభజించారు.
●అయితే ఆంధ్రా, ఒడిశాల మధ్య సరిహద్దుల నిర్ణయం అప్పట్లో చర్చనీయాంశమైంది.
●విశాఖ, గంజాం జిల్లాలను ఒడిశాలో కలపాలని ప్రతిపాదించారు. దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో ‘వందేమాతరం–మనదే రాజ్యం’ అనే నినాదంతో ప్రత్యేక ఉద్యమం మొదలైంది.
●ప్రత్యేకంగా బరంపురం, పర్లాఖిమిడి ప్రాంతాలు తెలుగు వారివే అని, వాటిని ఒడిశాలో చేర్చకుండా అడ్డుకోవాలని ఆంధ్రా నాయకులు నిశ్చయించుకున్నారు.
●‘శ్రీకాకుళం నుంచి శ్రీ పర్వతం దాకా తెలుగు వీర పవిత్ర తీర్థాలు సేవింప..’ అంటూ మహాకవి వెంకటరత్నం ఒక పాటను రచించి, తెలుగు వారి ఉద్యమాన్ని ఉత్తేజపరిచారు.
●పర్లాఖిమిడి జమిందార్, బ్రిటిష్ అధికారులతో చేతులు కలిపినట్లు తెలియగానే, తెలుగు వారి ఆందోళన తీవ్రమైంది.
●పర్లాఖిమిడి, బరంపురంలను ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించకపోతే, కటకం (కటక్) వరకు అడుగుతామని పేచికి దిగారు.
●వాడుక భాష కోసం పోరాటం జరిపిన గిడుగు రామ్మూర్తి పంతులు పోరాటానికి నడుం కట్టారు. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన ‘ఓడొనెల్ కమిటీ’ ముందు పర్లాఖిమిడితో పాటు ఆ పరిసరాలన్నీ ఆంధ్రాకు చెందాలంటూ రామ్మూర్తి పంతులు గట్టిగా వాదించారు.
●దీంతో జమిందార్ ఆగ్రహించి 1932 ఫిబ్రవరిలో పంతులు కుమారుడు సీతాపతిని ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ పంతులు సీతాపతిని ఎన్నికల్లో దించి పర్లాకిమిడి జమిందార్ బలపరిచిన అభ్యర్థులపై గెలిపించారు.
●సీతాపతి అప్పట్లో లండన్ వెళ్లి మరీ బ్రిటిష్ వారి ముందు తన వాదన వినిపించారు. కానీ జమిందార్లతో బ్రిటిష్ వారికి ఆ రోజుల్లో ఉన్న అవగాహన వల్ల పర్లాఖిమిడితో పాటు ఆ తాలూకాలోని మూడో వంతు ప్రాంతాన్ని ఒడిశాలో ఉంచుతూ నిర్ణయించారు.
●1936లో ఒడిశా రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటైన తర్వాత రామ్మూర్తి పంతులు కలత చెంది వచ్చేశారు.
హైకోర్టులో కేసు వేశారు
కింజరాపు కుటుంబీకుల కనుసన్నల్లోనే గ్రావెల్‌ను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తరలించుకుపోతున్నారు. లీజుదారుడైన నన్ను సంప్రదించకుండా దౌర్జన్యంగా గ్రావెల్‌ను తీసుకువెళ్తున్నారు. జిల్లా మైన్స్ విజిలెన్స్, రెవెన్యూ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిపై హైకోర్టులో కేసు వేశాను.
– మండపాక నర్సింగరావు, లీజు దారుడు,
వల్లే వలస
●ఇంటింటా తిరంగా..!
న్యూస్‌రీల్
ఆ రోజే
ప్రత్యేకం..

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం