
● ఉత్సాహంగా 5కే రన్
ఇచ్ఛాపురం: స్థానిక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో 5కే రన్ పోటీలను శుక్రవారం నిర్వహించారు. పోటీల్లో యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు డా.మోహన్‌వెంకటేష్ మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు 5కే రన్ పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో బాలికల విభాగంలో జి.యామిని, ఎం.హారిక, సీహెచ్ పుష్ప, బాలురు విభాగంలో ఆర్.సాయి, ఆర్.పవన్, పి.రాకేష్‌లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు కె.రామ్మూర్తి, డా.త్రినాథ్‌రెడ్డి, బి.షణ్ముఖ, కె.రామారావు, డి.కృష్ణమూర్తి, గోపి చౌదరి తదితరులు పాల్గొన్నారు.