రాష్ట్ర బాక్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులను ఎంపిక చేశారు. విశాఖపట్నంలోని గాజువాక వేదికగా సోమవారం నుంచి 6వ ఏపీ రాష్ట్ర స్థాయి జూనియర్స్, పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే 11 మంది జిల్లా క్రీడాకారులు ఆదివారం గాజువాక వెళ్లారు. అంతకుముందు వీరికి అధికారులు, బాక్సింగ్ సంఘ ప్రతినిధులు పలు సూచనలు చేశారు. క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తితో ఆడుతూ విజయమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు, శ్రీకాకుళం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బీఏ లక్ష్మణదేవ్, వంగా మహేష్, కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు, అసిస్టెంట్ కోచ్ రాజీవ్, సీనియర్ బాక్సర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎంపికై న క్రీడాకారులు వీరే..
కె.యశ్వంత్ (46 కేజీల విభాగం), కె.లక్ష్మీసాయి (48 కేజీల విభాగం), కె.గుణశేఖర్ (50 కేజీల విభాగం), ఎన్.జోషి (52 కేజీల విభాగం), ఎస్.దేవి వరప్రసాద్ (54 కేజీల విభాగం), ఎస్.వినయ్ వరుణ్ (57 కేజీల విభాగం), ఎం.దినేష్ (60 కేజీల విభాగం), ఏ.రామ్‌చరణ్ రెడ్డి (63 కేజీల విభాగం), పి.కృష్ణమోహన్ (66 కేజీల విభాగం), టి.గణేష్ (80 కేజీల విభాగం), జి.సత్య భార్గవ్ (80+ కేజీల విభాగం)


