శ్రీకాకుళం
న్యూస్‌రీల్
నచ్చినోళ్లకే టెండర్
పీఎం అభిమ్ హెల్త్ సెంటర్ల టెండర్లపై అధికార పార్టీ నేతల పెత్తనం టెండర్లకు ముందే కాంట్రాక్టర్లతో ఒప్పందం బయట వ్యక్తులు టెండర్లు వేస్తే రద్దు చేసేలా మంత్రాంగం తమవారికే దక్కేలా రీ టెండర్లకు పిలుపు
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సింగుపురంలో హాస్టల్‌కు కూతవేటు దూరంలో వైన్‌షాపు ఏర్పాటు చేయడం విమర్శలకు
తావిస్తోంది. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రస్తుతం జిల్లాలో కాంట్రాక్టర్లకు సంబంధించి గత అనుభవంతో పనిలేదు. ఎంత బాగా పనిచేసిందన్నది అక్కర్లేదు. సంస్థకు అర్హత ఉందా అన్నది అవసరం లేదు. విచిత్ర షరతులతో టెండర్లు పిలవడం, అనుకున్న సంస్థకే టెండర్ కట్టబెట్టడం సర్వసాధారణంగా మారింది. ఇందుకు ఎవరైనా అడ్డు తగిలితే వారిని ఏదో ఒక విధంగా పక్కన పెట్టడం మామూలైపోయింది. జిల్లాలో ఎవరు పనిచేయాలో అధికార పార్టీ నేతలే డిసైడ్ చేస్తున్నారు. దానికోసం ముందుగానే పర్సంటేజీల ఒప్పందం చేసుకుంటున్నారు. 20, 30, 40 శాతం అంటూ ముడుపుల ఆట ఆడుతున్నారు. మొత్తానికి పీఎం అభిమ్ స్కీమ్ కింద మంజూరైన హెల్త్ సెంటర్లు కీలక నేతలకు కాసులు కురిపిస్తున్నాయి.
అస్మదీయులూ..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులపై అధికార పార్టీ కీలక నేతలు పెత్తనం చేస్తున్నారు. అస్మదీయులైన కాంట్రాక్టర్లకే టెండర్లు దక్కేలా చక్రం తిప్పుతున్నారు. తమకు కావాల్సిన వ్యక్తికి దక్కకపోతే ఏకంగా టెండర్లు రద్దు చేస్తున్నారు. సరిగ్గా డాక్యుమెంట్లు లేవని సాకులు చూపించి వాటికి మళ్లీ టెండర్లు పిలుస్తున్నారు. అస్మదీయులకు కట్టబెట్టేందుకు నిబంధనలకు పాతరేస్తున్నారు. తమ వారికి తప్ప మిగిలిన ఏ కాంట్రాక్టర్లకు పనులు దక్కకుండా టెండర్లాట ఆడుతున్నారు.
నేతలదే పెత్తనం..
ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్(పీఎం అభిమ్) కింద జిల్లాలో 31 హెల్త్ క్లీనిక్ బిల్డింగ్స్‌కు టెండర్లు పిలిచారు. ఒక్కొక్క భవన నిర్మాణం విలువ రూ.48 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు ఉంది. పంచాయతీరాజ్ ఎస్‌ఈ ఆఫీస్ పరిధిలో టెండర్లు పిలిచారు. ఇంతవరకు బాగానే ఉన్నా టెండర్ల విషయంలో నేతల పెత్తనం పెరిగిపోయింది. నియోజకవర్గ కీలక నేతల దిశా నిర్దేశం తప్పనిసరిగా మారింది. వారి సూచనల మేరకే కాంట్రాక్ట్ సంస్థ ఏదన్నది ఫైనలయ్యే పరిస్థితి ఏర్పడింది. కావాల్సిన వారికే కాంట్రాక్ట్ దక్కేలా చూసేందుకు అనుకూల యంత్రాంగం ద్వారా పావులు కదుపుతున్నారు. నీకింత నాకింత అని ముందే ఒప్పందం చేసుకుని కాంట్రాక్టర్‌ను ఖరారు చేసే పరిస్థితి నెలకొంది. కానివారికి పొరపాటున టెండర్ వస్తుందనుకుంటే రద్దు చేసే దుస్థితి చోటు చేసుకుంది.
ఒప్పందం ప్రకారమే..
పీఎం అభిమ్ కింద పిలిచిన టెండర్ల విషయంలో చాలా నియోజకవర్గాల్లో కీలక నేతలు చెప్పిన వాళ్లే టెండర్లలో షెడ్యూల్ దాఖలు చేస్తున్నారు. ముందు కీలక నేతలను కలుసుకుని, వారికివ్వాల్సింది ఇవ్వడం.. పర్సంటేజీ ఫిక్స్ చేసుకోవడం పూర్తయ్యాకే టెండర్లలో పాల్గొంటున్నారు. ముందే ఒప్పందాలు జరిగిపోవడంతో చాలా చోట్ల అనుకున్నట్లుగానే టెండర్లు ఖరారయ్యాయి. కొన్నిచోట్ల మాత్రం వేరే కాంట్రాక్టర్లు పాల్గొనడంతో సమస్య వచ్చింది. ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాలతో పాటు రణస్థలం, నందిగాంలో అధికార పార్టీ నేతలకు కావాల్సిన వారితో పాటు ఇతర కాంట్రాక్టర్లు షెడ్యూల్స్ దాఖలు చేశారు. వీరిలో అస్మదీయేతరులకు టెండర్లు ఖరారయ్యే పరిస్థితి ఉండటాన్ని గమనించిన అధికార పార్టీ నేతలు తమదైన శైలిలో యంత్రాంగంపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. డాక్యుమెంట్లు సరిగా లేవని సాకులు చూపించి టెండర్లను రద్దు చేయించేశారు. ఇప్పుడా వర్క్‌లకు మళ్లీ టెండర్లు పిలిచే పనిలో పడ్డారు. అయిన వారే టెండర్లలో పాల్గొనేలా పథక రచన చేస్తున్నారు.
జొన్నవలస ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రవి
శ్రీకాకుళం
శ్రీకాకుళం


