టీడీపీకి అనుకూలంగా పంచాయతీల పునర్విభజన
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పలు పంచాయతీల పునర్విభజన అశాసీ్త్రయంగా జరుగుతోందని, టీడీపీకి అనుకూలంగా విభజన చేస్తున్నారని, దీనిపై పునరాలోచన చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదిక(పీజీఆర్‌ఎస్)లో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభు త్వం ఇటీవల పంచాయతీల విభజన చేసే ప్రక్రియలో భాగంగా కొత్తగా గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అందు లో భాగంగా సారవకోట మండలంలో అలుదు, జలుమూరు మండలంలో అంధవరం, దరివాడ, పోలాకి మండలంలో బొద్దాం, నరసన్నపేట మండలంలో మడపాం, వి.ఎన్.పురం పంచాయతీల పరిధిలో గ్రామాలను వేరుచేసి కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సర్పంచ్, కార్యవర్గ ఆమోదం, తీర్మానం లేకుండా కొందరు వ్యక్తులు సమర్పించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం తగదన్నారు. పంచాయతీ, ప్రజామోదం మేరకే విభజన చేయాలని కోరారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, వాన గోపి, ముద్దాడ బైరాగి నాయుడు, కనపల శేఖర్‌రావు, రౌతు శంకరరావు, పైడి విఠల్ తదితరులు పాల్గొన్నారు.


