సుందరం.. చరిత్రాత్మకం
ఆ గంటకు 130 ఏళ్లు..
టెక్కలి సెంటినరీ ఆంధ్రాబాప్టిస్టు చర్చిలో
130 ఏళ్లుగా వినియోగిస్తున్న ప్రార్థన గంట
క్రిస్మస్ ముందస్తు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. క్రైస్తవ ఆరాధకులు ప్రార్థనలు, ఏసుక్రీస్తు గీతాలాపనలు, ర్యాలీలు, కేక్ కటింగ్‌తో సందడి చేస్తున్నా రు. అయితే ఈ ఉత్సాహం, సందడి మన జిల్లాలో ఇప్పటిది కాదు. వందేళ్ల కిందటి నుంచే సిక్కోలులో చర్చిలు ఏర్పాటయ్యా యి. అనేక ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. సిక్కోలులో చరిత్రాత్మక అంశాలతో కూడిన చర్చిల ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దామా..
టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలోని అంబేడ్కర్ కూడలిలో ఆంధ్రాబాప్టిస్టు చర్చిలో 130 ఏళ్లుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. 1889లో సంఘం స్థాపించినప్పటికీ 1905లో కెనడాకు చెందిన క్రిస్టియన్ మిషనరీష్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధి ఆర్చి బాల్డ్ ఆధ్వర్యంలో పాస్టర్ డబ్ల్యూ.హేగెన్స్ పర్యవేక్షణలో చర్చి నిర్మించారు. సుమారు 130 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రార్థన గంటను ఇప్పటికీ వినియోగిస్తున్నారు.
క్రిస్మస్
స్పెషల్
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని ఆర్‌సీఎం సహాయ మాత చర్చి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే అతిపెద్ద ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా గుర్తింపుపొందింది. బిషప్ రాయరాల విజయకుమార్, ఫాదర్ పాల్‌భూషణ్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. పది రోజుల ముందుగానే చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి.
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని టౌనుహాలు రోడ్డులో పునీత తోమాసు దేవాలయం పేరిట ఉన్న సెయింట్ థామస్ చర్చిని రెండో పోప్ జాన్‌పాల్ నిర్మించారు. 1999లో పునరుద్ధరించిన ఈ చర్చిలో ఆరోగ్యమాత మందిరం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. వెయ్యి మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా పెద్ద హాలు ఇక్కడి ప్రత్యేకత. ప్రస్తుతం ఫాదర్ బోనెల రాజు ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు.
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చిన్నబజారులో పురాతనమైన తెలుగు బాప్టిస్టు చర్చిలో పెద్ద పరిశుద్ద గ్రంథం(బైబిలు) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారీ తెలుగు అక్షరాలతో చదువుకునేందుకు వీలుగా గాజు బల్లపై అందుబాటులో ఉంచారు. ఏ–3 సైజుకన్నా పెద్దసైజులో బైడింగ్ చేసిన ఈ పుస్తకాన్ని బెంగళూరులోని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తయారు చేసింది. రూ.5 వేలుతో కొనుగోలు చేసి ఇక్కడ ఉంచారు. 1832లో ఈస్టిండియా కంపెనీకి చెందిన మిస్టర్ బ్రట్ జేమ్స్ డాసన్ క్రీస్తు ప్రార్థనా మందిరంగా ఏర్పాటు చేశారు. 1846 సెప్టెంబరు 12న తెలుగు బాప్టిస్టు చర్చి పేరిట ప్రారంభించారు.
సుందరం.. చరిత్రాత్మకం
సుందరం.. చరిత్రాత్మకం
సుందరం.. చరిత్రాత్మకం
సుందరం.. చరిత్రాత్మకం
సుందరం.. చరిత్రాత్మకం
సుందరం.. చరిత్రాత్మకం


