మాజీ మంత్రిని కలిసిన ఆర్.నారాయణమూర్తి
వజ్రపుకొత్తూరు రూరల్: విద్యా వ్యవస్థలో మాఫియా చేస్తున్న పేపర్ లీకేజ్‌తో విద్యార్థులకు జరగుతున్న అన్యాయాన్ని తెలియజేసే ‘యూనివర్శీటీ పేపర్ లీక్’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా పలాస–కాశీబుగ్గ మున్సిపాలీటిలో సోమవారం సినీ దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి పర్యటించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా వీక్షించేందుకు ఆహ్వానం పలికారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు.
శ్రీకాకుళం అర్బన్: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్షలకు సైతం వెనుకాడేది లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్‌ల ఐక్యవేదిక ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళంలోని దండివీధి వద్ద డీసీసీబీ బ్యాంక్ ఎదుట ఐక్యవేదిక ఆధ్వర్యంలో పీఏసీఎస్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాధ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లోలుగు మోహనరావు, బల్లెడ రామారావు తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఈ నెల 29న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే జనవరి 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అనంతరం బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి దత్తి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు బొడ్డేపల్లి సన్యాసిరావు, కె.లక్ష్మీనారాయణ, వై.పాపినాయుడు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రిని కలిసిన ఆర్.నారాయణమూర్తి


