శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని పెదగనగళ్లవానిపేట బీచ్
● తీరం..పరిశుభ్రం..
– శ్రీకాకుళం రూరల్
కరాటే పోటీల్లో ప్రతిభ
రణస్థలం: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన 11వ రాష్ట్ర స్థాయి పెన్‌కాట్ సిలాట్ కరాటే పోటీల్లో రణస్థలం శ్రీ పరుశురాం యుద్ధ కళాక్షేత్రానికి చెందిన విద్యార్థులు సత్తాచాటారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి పలువురు పతకాలు సాధించారని ట్రైనర్ లింగాల ఈశ్వరరావు తెలిపారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు.
8 నుంచి శంకర విజయంపై ప్రవచనాలు
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని బాపూజీ కళామందిర్‌లో ఈ నెల 8 నుంచి 12 వరకు మైసూరుకు చెందిన సంతోష్‌కుమార్ ఘనపాటిచే శ్రీశంకర విజయంపై ప్రవచనాలు జరుగుతాయని గుజరాతిపేట రాజరాజేశ్వరీ పీఠం నిర్వాహకులు పెంట రామచంద్రశేఖరశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ప్రవచనాలు ప్రారంభమవుతాయని, అందరూ పాల్గొనాలని కోరారు.
శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని పెదగనగళ్లవానిపేట బీచ్


