సమర్థంగా డి–అడిక్షన్ కేంద్రాల నిర్వహణ
● ఎకై ్సజ్ అధికారుల సమీక్షలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అక్రమంగా తయారవుతున్న మద్యం(ఐడీ లిక్కర్) వల్ల తలెత్తుతున్న ఆరోగ్య, ఆర్థిక సమస్యలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలు, మద్యం బారిన పడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై ఎకై ్సజ్ శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమ మద్యం వల్ల బలహీన వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. దీని తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై నియంత్రణ పెట్టాలన్నారు. ఇందులో ప్రధాన పాత్ర పోషించే వ్యక్తులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీ–అడిక్షన్ కేంద్రాల సమర్థ వినియోగంపై జిల్లాలో ఏర్పాటు చేసిన కేర్ కమిటీ (కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యకలాపాలను సమీక్షించారు. ఇప్పటివరకు ఈ కమిటీ ద్వారా 16 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా 595 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ కేంద్రాన్ని ఒకసారి సందర్శించినట్లు కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. ఇందులో తొమ్మిది మంది చేరగా ఏడుగురు విజయవంతంగా పునరావాసం పొందినట్లు అధికారులు వెల్లడించారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఐడీ మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 2, 4వ శనివారాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషన ర్ రామచంద్రరావు, అదనపు ఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


