కుట్టు మిషన్ల శిక్షణ పేరిట మోసం
అక్రమ తవ్వకాలకు నిలువెత్తు సాక్ష్యం..
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 51వ సర్వే నంబర్ సూదికొండ వెనుకభాగంలో కంకర తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరిగాయి. విద్యుత్ స్తంభం తప్ప మిగిలిన ప్రాంతాన్ని ఆక్రమార్కులు తవ్వకాలు జరిపి తరలించేశారు. స్తంభం కూలి ప్రమాదం జరగకముందే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
– కాశీబుగ్గ
ఎల్.ఎన్.పేట: బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం రూ.150 కోట్లు మోసానికి పాల్పడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతప ట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన మహిళలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభం నాటికే భారీ మోసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 1,02,832 మంది మహిళలకు శిక్షణ కోసం రూ.221.08 కోట్లు నిధులు కేటాయించారని, ఒక్కొక్క కుట్టు మిషన్ రూ.4,300, కుట్టు శిక్షణ కోసం మహిళకు రూ.3 వేలు ఖర్చు అవుతుందన్నారు. వాస్తవ వ్యయం రూ.750 కోట్లు మాత్రమే ఉంటుందన్నారు. మిగిలిన డబ్బులు ఎవరి ప్రయోజనం కోసం ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో ఆదరణ పథకం పేరుతో చేతి వృత్తులు, కుల వృత్తులు వారిని మోసం చేయటంతో పాటు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు కుట్టు శిక్షణ, మిషన్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్నట్లు ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల ఆర్థిక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు.
రెడ్డి శాంతి
కుట్టు మిషన్ల శిక్షణ పేరిట మోసం


