లక్ష్యానికి దూరం..
శ్రీకాకుళం పాతబస్టాండ్:
పేదలకు దినసరి వేతనం కల్పించి, వలసల నివారణకు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో తగ్గుతోంది. ఈ పనులను నమ్ముకుని ఉన్న వేతనదారులకు న్యాయం జరగడం లేదు. అధికారులు–సిబ్బంది కుమ్ములాట, వ్యక్తిగత ప్రతిష్టలు ఈ శాఖలో మిగులుతున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో కూలీలకు న్యాయం జరగడం లేదు. ఒక పక్క అధికారుల అసమర్థత, మరో పక్క ప్రభుత్వం విధానాలతో ఈ పనులు మందగిస్తున్నాయి. అధికారులు క్షేత్ర స్థాయిలో పనులపై ఆసక్తి చూపడం లేదు.
ఒకప్పుడు జిల్లా రాష్ట్రస్థాయిలోనే పనుల కల్పనలో మొదటి, ద్వితీయ స్థానాల్లో ఉండేది. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు, వేతనదారులకు పనిదినాల కల్పన, వేతనాల చెల్లింపులు, మెటీరియల్ కాంపోనెంట్ జనరేషన్‌లో గుర్తింపు పొందింది. తాజాగా 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ఫలితాలు దిగువ స్థాయికి చేరాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేవలం కాంపోనెంటు మొ త్తంలో మాత్రమే మూడో స్థానంలోకి చేరారు. మిగిలిన ప్రమాణాల్లో జిల్లా వెనుకబడిపోయింది.
ఆర్ధిక సంవత్సరం లక్ష్యాలు
2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళిక ప్రక్రియలో అంచనా విలువ రూ.1499.03 కోట్లుగా వేశారు. మొత్తం 41,523 పనులను గుర్తించారు. ఈ పనుల్లో భాగంగా గోశాల నిర్మాణం, సేద్యపు నీటి కుంటలు, సమతల, రింగు, కాంటూరు కందకాలు, కాలువలు, చెరువులు, పశువులకు నీటి తొట్టెలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, సోక్ పిట్స్, కంపోస్ట్ పిట్స్, చేపల చెరువులు, వరద కట్టలు, మట్టి రోడ్లు, భూ అభివృద్ధి పనులు, మినీ పెర్కొలేషన్ ట్యాంక్‌లు, హౌసింగ్ లబ్ధిదారులకు 90రోజులు పనిదినాలు, సరోవరాలు, కోనేరులు పూడిక తీత, పల్లె పుష్కరిణిలు తదితర పనులు చేపట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.
జిల్లాలో తగ్గిన ఉపాధి పనులు
లక్ష్యాలకు దూరంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు


